ASBL NSL Infratech

లోక్ సభ ఎన్నికల్లో ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి : కేటీఆర్

లోక్ సభ ఎన్నికల్లో ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి : కేటీఆర్

తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్రనగర్‌లో జరిగిన రోడ్‌ షోలో కేటీఆర్‌ ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌కు 8 నుంచి 10 సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనం చెప్పినట్లే వింటుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండే ఎవరైనా మన వద్దకు రావాలంటే బీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు కావాలన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులను కోరారు. బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్‌. ఆ వర్గాలకు సీట్లు ఇస్తే గెలవరన్న అపవాదు ఉంది. అది తప్పని నిరూపించాలి. 

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో మొదటిసారి బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారు. కాసానిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మోదీ, ఎన్డీయే కూటమికి 400 కాదు. 200 సీట్లు కూడా వచ్చేలా లేవు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నిలదీయాలి.  రైతుల దగ్గరకు వెళ్లి రూ.2 లక్షల రుణమాఫీ హామీ నెరవేరిందా అని అడగాలి. కేసీఆర్‌ అభివృద్ధి చేసిన పదేళ్ల పాలన ఒకవైపు, కాంగ్రెస్‌ 100 రోజుల అబద్ధాల పాలన మరో వైపు. బీజేపీ పదేళ్లలో ఏం చేసిందో చెప్పి ఓటు అడగమంటే చెప్పేందుకు ఒక్కటీ లేదు అని విమర్శించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :