ASBL NSL Infratech

యూట్యూబర్ స్థాయికి దిగజారిపోయిన రాంగోపాల్ వర్మ..! ఇదేం ఖర్మ..!!

యూట్యూబర్ స్థాయికి దిగజారిపోయిన రాంగోపాల్ వర్మ..! ఇదేం ఖర్మ..!!

రామ్ గోపాల్ వర్మకు సంచలన దర్శకుడు అని పేరు. నిజంగానే ఆయన ఏం చేసినా సంచలనమే.! సర్కార్ లాంటి సినిమాలు తీసినా, పోర్న్ తరహా మూవీలను తెరకెక్కించినా ఆయనకే సాధ్యం. ఒకప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు రాంగోపాల్ వర్మ. కానీ ఇప్పుడాయన ఓ యూట్యూబర్ స్థాయికి దిగజారిపోయారు. రోజుకో వీడియోతో నిజాలను నిగ్గుతేల్చునానని చెప్తున్నారు. ఆయన వీడియోల్లో నిజాలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు.. అని అందరూ అనుకునే స్థాయికి వెళ్లిపోయాడు రాం గోపాల్ వర్మ.

శివ, క్షణక్షణం, గాయం, సత్య, కంపెనీ, సర్కార్ లాంటి సినిమాలతో రామ్ గోపాల్ వర్మ పేరు మార్మోగిపోయింది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ కు అడుగు పెట్టిన ఘనత వర్మదే. అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ తో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి చరిత్ర సృష్టించారాయన. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మతో సినిమా అంటే హీరోలు ఎగిరి గంతేసేవారు. ఆయనతో జీవితంలో ఒక్క సినిమా అయినా తీయాలని ఉబలాటపడేవారు. ఇక ఎంతో మంది దర్శకులు ఆయన దగ్గర ఓనమాలు దిద్దుకున్నవారే. పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ లాంటి ఎందరో దర్శకులకు రామ్ గోపాల్ వర్మ గురువు. దర్శకుల్లో టెక్నికల్ గా మంచి పట్టున్న వ్యక్తి రాం గోపాల్ వర్మ.

అయితే ఇదంతా గతం. ఇప్పుడు రాం గోపాల్ వర్మ పెద్ద జోకర్. ఆయన్ను కనీసం దర్శకుడిగా కూడా గౌరవించే స్థాయిలో కూడా లేదు చిత్ర పరిశ్రమ. వర్మతో సినిమా తీసేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. అందుకే ఐటెమ్ గర్ల్స్ ను పెట్టి తన సినిమా దూల తీర్చుకుంటున్నారు. అవి కూడా అట్టర్ ఫ్లాపులే. వర్మ సినిమాలను రిలీజ్ చేసేందుకు కూడా డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాని పరిస్థితి. అందుకే తానే ఓటీటీ ప్లాట్ ఫాం పెట్టుకున్నారు. అది కూడా ఫెయిల్. అందుకే వెబ్ సైట్లో సినిమాలు అప్ లోడ్ చేసి డబ్బు పే చేసి చూడమంటున్నారు. ఇలా ఒకప్పటి ఏస్ డైరెక్టర్ ఇప్పుడు స్ట్రీట్ డైరెక్టర్ అయిపోయారు.

ఇన్నాళ్లూ కనీసం మెగా ఫోన్ పట్టుకున్న వర్మ.. ఇప్పుడు యూట్యూబ్ మైక్ తో ముందుకొచ్చాడు. దీంతో ఆయన ఇంతకంటే ఇక దిగజారడు అనుకున్న ప్రతిసారీ మరింత పతనమవుతున్నారనిపిస్తోంది. ఇప్పుడు యూట్యూబ్ లో నిజం పేరుతో సిరీస్ నడిపిస్తున్నారు. కొన్ని ఎంపిక చేసుకున్న అంశాల లోతుల్లోకి వెళ్లి విచారించి నిజాన్ని నిగ్గుతేల్చుతున్నట్టు చెప్తున్నారు. కానీ వర్మ మార్కు నిజం ఎలా ఉంటుందో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. తను అనుకున్న కోణంలోనే నిజాలను రాబట్టుకోవడంలో వర్మ దిట్ట. తను నమ్మిందే నిజమని నమ్మే వ్యక్తి ఆయన. అలాంటప్పుడు ఆయన నిజాలతో జనమంతా ఏకీభవించాలనే పని లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :