ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవ‌నున్న జ‌క్క‌న్న‌

ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవ‌నున్న జ‌క్క‌న్న‌

గుంటూరు కారం త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న త‌ర్వాతి సినిమాను రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మ‌హేష్ ఈ సినిమా కోసం క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టాడు. రాజ‌మౌళి కూడా మ‌హేష్ సినిమాను ఒక తెలుగు సినిమాలా కాకుండా హాలీవుడ్ సినిమా రేంజ్ లో తీయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు రాజ‌మౌళి, హాలీవుడ్ నుంచి టెక్నీషియ‌న్స్ ను దింపుతున్నాడ‌ట‌. అయితే రాజ‌మౌళి ఈ సినిమాను కూడా ఆర్ఆర్ఆర్ లానే టైటిల్ ముందుగానే చెప్పి స్టార్ట్ చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ టైమ్ లో కూడా రాజ‌మౌళి టైటిల్ చెప్పి, సినిమా గురించి వివ‌రాల‌న్నింటినీ చెప్పాడు.

ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా అలానే టైటిల్ ను రివీల్ చేసి షూటింగ్ ను స్టార్ట్ చేస్తాడ‌ట జ‌క్క‌న్న‌. యూనివ‌ర్స‌ల్ అప్పీల్ ఉండేలా సినిమాకు టైటిల్ ను ప్లాన్ చేస్తున్నాడ‌ట రాజ‌మౌళి. రూ.300 నుంచి రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో రూపొంద‌నున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ తో కూడా చేతులు క‌లుపుతున్నాడట రాజ‌మౌళి. చూస్తుంటే రాజ‌మౌళి ఈ సినిమాతో నెక్ట్స్ లెవెల్ కు వెళ్ల‌డం ఖాయ‌మ‌నిపిస్తుంది. ఈ సినిమా గురించి అనౌన్స్ చేయ‌డానికి రాజ‌మౌళి ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెడ‌తాడా అని ఫ్యాన్స్ ఎంత‌గానో వెయిట్ చేస్తున్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :