విలన్ గా మారిన యంగ్ హీరో...

విలన్ గా మారిన యంగ్ హీరో...

మాస్ డైరెక్టర్ బోయపాటి శీను సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. అఖండ తర్వాత ఈ దర్శకుడిపై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. టాలీవుడ్ లో మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా బోయపాటిని చెప్పొచ్చు. తన మార్క్ సినిమాలతో యూత్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేయడం బోయపాటి స్పెషలిటీ. ప్రెజెంట్ ఈ మాస్ డైరెక్టర్ హీరో రామ్ తో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. రామ్ పోతినేని లాస్ట్ మూవీ వారియర్ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. 

ఇక ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి తన ఫాన్స్ కి ఫీస్ట్ ఇవ్వనున్నారు. దర్శకుడు బోయపాటి ప్రేక్షకులకి కావాల్సిన మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంశాలని ఈ సినిమాలో జోడించారని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుంది. అఖండ తర్వాత బోయపాటి తీస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై చాలానే హోప్స్ పెట్టుకున్నారు రామ్ ఫాన్స్. ఇదిలా ఉండగా ఈ న్యూ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. బోయపాటి , రామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఒక యంగ్ హీరో విలన్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది.

సాధారణంగా బోయపాటి సినిమాలో విలన్స్ అంటే సీనియర్ హీరోలని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.కానీ ఈసారి యంగ్ అప్ కమింగ్ హీరో ప్రిన్స్ ని ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విలన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో ప్రిన్స్ విలన్ గా నటిస్తుండడం విశేషం. బోయపాటి ఈ పాత్రని పవర్ ప్యాక్డ్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రిన్స్ రోల్ స్పెషల్ గా ఉండబోతుందని టాక్. ఎనర్జిటిక్ హీరో రామ్ కి ధీటుగా ప్రిన్స్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ క్రేజీ కాంబో ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

 

Tags :