ASBL NSL Infratech

వారాహిపై జనసేనాని కదిలె....

వారాహిపై జనసేనాని కదిలె....

పిఠాపురంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ చేశారు. నేటి నుంచి పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చేబ్రోలులో మొదటి ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. వారాహి విజయభేరి యాత్ర పేరుతో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ముందుగా పిఠాపురం పురుహుతికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వారాహి వాహనానికి పూజలు నిర్వహించనున్నారు. దొంతమూరులో పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ తో భేటీ కానున్నారు. అక్కడి నుంచి పిఠాపురంలో తన బసకు పయనం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు, రామాలయం సెంటర్‌లో వారాహి విజయభేరీ బహిరంగసభ నిర్వహించనున్నారు.

తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారు. నేటి నుంచి ఏప్రిల్‌ 12 వరకూ ఆయన పర్యటనలు ఉంటాయి. ఏప్రిల్‌ 2 వరకూ ఆయన పిఠాపురంలో ఉంటారు. ఏప్రిల్‌ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా 9వ తేదీన పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 10వ తేదీన రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభలకు పవన్ హాజరవుతారు.

మరోవైపు పిఠాపురంలో కాపు సామాజిక ఓటర్లు అధికంగా ఉండడంతో గెలుపుఖాయమన్న భావనలో ఉన్నారు పవన్. దీనికి తోడు టీడీపీ నేత వర్మ సహకారం అందితే బంపర్ మెజార్టీఖాయమని భావిస్తున్నారు. అందులో భాగంగా వర్మసహకారం కోరుతున్నారు. మరోవైపు చంద్రబాబు బుజ్జగింపులతో మెత్తబడిన వర్మ సైతం..పవన్ కు తనవంతు సాయమందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పవన్ ఈసారి అసెంబ్లీ మెట్లెక్కడం ఖాయమని జనసేన సైనికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పవన్ ఈసారి కూడా అసెంబ్లీ గేటు తాకకూడదన్న పట్టుదలతో ఉన్న అధికారవైసీపీ.. అన్ని శక్తియుక్తులను పిఠాపురంపై కేంద్రీకరించింది. కాపు సామాజికవర్గం ఓట్లు చీల్చేందుకు గానూ ముద్రగడ, ద్వారంపూడి సహా పలువురు కాపు నేతలను మోహరించింది. దీనికి తోడు వంగాగీత బరిలో దిగుతుండడం..పిఠాపురం ఫైట్ టఫ్‌గానే మారుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :