ASBL NSL Infratech

పరిమిత కాల దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా; అద్భుతమైన వారంటీ మరియు ఎక్స్ఛేంజ్ డీల్స్ ని ప్రకటించిన కంపెనీ

పరిమిత కాల దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా; అద్భుతమైన వారంటీ మరియు ఎక్స్ఛేంజ్ డీల్స్ ని ప్రకటించిన కంపెనీ

● S1 Pro Gen 2 పై గరిష్టంగా INR 7,000 విలువైన 5 సంవత్సరాల ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ
● S1 Air మరియు S1 X+ ఎక్స్టెండెడ్ బాటరీ వారంటీ మరియు కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీ పై 50% వరకు తగ్గింపు
● S1 Pro Gen-2, S1 Air మరియు S1 X+పై INR 10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్
● నవంబర్ 10 నుండి అన్ని ఓలా స్కూటర్‌లపై INR 2,000 అదనపు తగ్గింపు

భారతదేశంలో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ భారత్ EV ఫెస్ట్‌లో భాగంగా ఈరోజు నుండి అద్భుతమైన దీపావళి ఆఫర్‌లను ప్రకటించింది. ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, సమగ్ర వారంటీపై భారీ తగ్గింపులు, లాభదాయకమైన ఫైనాన్సింగ్ డీల్స్, మరియు నవంబర్ 10 నుండి అన్ని స్కూటర్ల పై అదనపు INR 2,000 సహా INR 26,500 వరకు విలువైన ఆఫర్‌లను కస్టమర్‌లు ఇప్పుడు పొందవచ్చు.

S1 Pro Gen-2 కొనుగోలు పై కస్టమర్‌లు ఇప్పుడు INR 7,000 విలువైన ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీని పొందవచ్చు. S1 Air మరియు S1 X+ కొనుగోలు పై ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ మరియు  కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీ పై 50% వరకు తగ్గింపు  పొందవచ్చు. S1 Pro Gen-2ని కొనుగోలు చేసే కస్టమర్‌లు ఇప్పుడు కేవలం INR 2,000 చెల్లించడం ద్వారా కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీకి (INR 9,000 విలువ) అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.

కస్టమర్‌లు తమ పాత ICE 2Wని మార్చుకొని S1 Pro Gen-2 కొనుగోలుపై గరిష్టంగా INR 10,000 వరకు మరియు S1 Air మరియు S1 X+ కొనుగోలుపై INR 5,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ పొందవచ్చు. కొనుగోలుదారులు తమ సమీపంలోని ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు వెళ్లడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

ఫైనాన్స్ ఆఫర్లు

కొనుగోలుదారులు కొన్ని క్రెడిట్ కార్డ్ EMIలపై INR 7,500 వరకు తగ్గింపులను పొందవచ్చు, అయితే ఫైనాన్స్ ఆఫర్‌లలో జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ EMI, జీరో-ప్రాసెసింగ్ ఫీజు మరియు 5.99% తక్కువ వడ్డీ రేట్లు వంటి ఇతర ఆఫర్స్ కూడా ఉంటాయి. ఈ ఆఫర్లు దీపావళి వరకు వర్తిస్తాయి.

లక్కీ-బూట్ ఆఫర్‌లు

కస్టమర్‌లు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడ్ చేయవచ్చు మరియు ప్రతిరోజూ S1X+ గెలుచుకునే అవకాశం పొందవచ్చు. అంతేకాకుండా, ఉచిత ఓలా మర్చండైస్, Ola Care+ డిస్కౌంట్ కూపన్‌లు, మరియు S1 ప్రో (జెన్ 2) కొనుగోలు పై INR 1,000 వరకు విలువైన డిస్కౌంట్ కూపన్స్ పొందవచ్చు.

రూ 1,47,499 ధరతో, S1 Pro (2వ జనరేషన్) డెలివరీలు గత వారం 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యాయి, అదేవిధంగా, S1 ఎయిర్ ₹1,19,999 కి అందుబాటులో ఉంది. ఓలా ఎలెక్ట్రిక్ అదనంగా విభిన్న ప్రాధాన్యతలతో రైడర్‌ల అవసరాలను తీర్చడానికి ICE-కిల్లర్ ప్రాడక్ట్ S1Xని మూడు వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది - S1 X+, S1 X (2kWh), మరియు S1 X (3kWh) . S1 X+ ఇప్పుడు రూ ₹1,09,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. S1 X (3kWh) మరియు S1 X (2kWh) కోసం ప్రీ-రిజర్వేషన్ విండో ఇప్పుడు రూ 999 వద్ద మాత్రమే తెరవబడింది. S1 X (3kWh) మరియు S1 X (2kWh) స్కూటర్‌లు రూ 99,999 మరియు రూ 89,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :