ASBL NSL Infratech

2W EV మార్కెట్‌లో కొనసాగుతున్న ఓలా ఆధిపత్యం

2W EV మార్కెట్‌లో కొనసాగుతున్న ఓలా ఆధిపత్యం

నవంబర్‌లో ~30,000 యూనిట్ల రిజిస్ట్రేషన్‌లతో ఆల్-టైమ్ రికార్డు

భారతదేశంలో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ నెలలో తన విక్రయాల వివరాలను ప్రకటించింది. బలమైన పండుగ డిమాండ్ నేపథ్యంలో నవంబర్ లో ఓలా ~30,000 రిజిస్ట్రేషన్‌లతో (వాహన్ డేటా ప్రకారం) కంపెనీ తమ యొక్క ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది. ఆకట్టుకునే ~30% MoM వృద్ధి మరియు 82% YoY వృద్ధితో, కంపెనీ నవంబర్‌లో ~35% మార్కెట్ వాటాతో EV స్కూటర్ విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగించింది.

ఈ మైలురాయిపై మాట్లాడుతూ, ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ ఇలా అన్నారు: “ఈ బలమైన అమ్మకాలు మా బ్రాండ్ మరియు మా స్కూటర్ లైనప్‌పై కస్టమర్‌లకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. నవంబర్ నెలలో అత్యధిక రిజిస్ట్రేషన్‌లతో కస్టమర్‌ల అగ్ర ఎంపికగా మేము ఆవిర్భవించాము మరియు డిసెంబర్‌లో ఈ ట్రెండ్ కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాము. గ్రీన్ మొబిలిటీ వైపు భారతదేశం యొక్క ప్రయాణాన్ని వేగవంతం చేయడం మరియు స్కూటర్ సెగ్మెంట్‌లో #EndICEAgeకి చేరువవాలనే మా నిబద్ధతలో మేము స్థిరంగా ఉన్నాము."

సెప్టెంబర్ 2022 నుండి గత ఐదు వరుస త్రైమాసికాలలో ఓలా ఎలక్ట్రిక్ తన పోల్ పోసిషన్ ని కొనసాగించింది. కంపెనీ యొక్క సరికొత్త S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియో ప్రారంభించినప్పటి నుండి అద్భుతమైన ప్రతిస్పందనను సాధించింది.

Ola S1 ప్రో మరియు S1 ఎయిర్ అద్భుతమైన స్పందనను పొందుతున్నాయి మరియు పండుగ సీజన్‌లో వినియోగదారులకు ఇష్టమైన ఎంపికగా అవతరించాయి. ఆకట్టుకునే పనితీరు మరియు ఆఫర్‌లతో, S1 ప్రో మరియు S1 ఎయిర్ రెండూ వాటి సంబంధిత కేటగిరీలలో అత్యుత్తమ EV ప్రతిపాదనలుగా ఆవరతరించాయి మరియు భారతదేశ EV స్వీకరణను నడపడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :