ASBL NSL Infratech

షెన్ జెన్ వీసా పట్టేయ్.. యూరోప్ చుట్టేయ్...

షెన్ జెన్ వీసా పట్టేయ్.. యూరోప్ చుట్టేయ్...

యూరోప్ పర్యటనలకు వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్. ఏటా వీసాలు పొందుతూ, పొడిగించుకుంటూ యూరోప్ వెళ్తున్న భారతీయులకు .. ఇక ఆ ఆబాధ తప్పనుంది. వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్‌జెన్‌ వీసా పొందొచ్చు. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను యూరేపియన్ కమిషన్‌ సరళీకరించింది. ‘‘భారతీయులకు బహుళ ప్రవేశ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను ఆమోదించింది. ఇవి ప్రస్తుతం అమల్లో ఉన్న వీసా ప్రామాణిక నిబంధనల కంటే మరింత అనుకూలమైనవి’’ అని ఈయూ ఓ ప్రకటనలో తెలిపింది.

‘‘కొత్త నిబంధనల ప్రకారం.. గత మూడు సంవత్సరాల్లో రెండు వీసాలను పొంది, చట్టబద్ధంగా వినియోగించిన భారతీయులకు దీర్ఘకాల, బహుళ ప్రవేశ షెన్‌జెన్‌ వీసాలను రెండేళ్ల కాలపరిమితికి జారీ చేయవచ్చు. సాధారణంగా ఈ రెండేళ్ల వీసా తర్వాత సంబంధిత ప్రయాణికుడి పాస్‌పోర్ట్‌లో సరిపడినంత చెల్లుబాటు గడువు సమయం ఉన్నట్లైతే ఐదేళ్ల వీసా జారీచేస్తారు. ఈ వీసాల చెల్లుబాటు సమయంలో సంబంధిత వ్యక్తులు వీసా ..ఫ్రీ దేశాల జాతీయులతో సమానంగా ప్రయాణ హక్కులను పొందుతారు’’ అని వివరించింది.

యూరోపియన్ యూనియన్‌లో తాజాగా క్రొయేషియా కూడా చేరడంతో ఇకపై ఆ యూనియన్‌లో 27 దేశాలు ఉండనున్నాయి. యూరోపియన్ యూనియన్‌లో చేరాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్న క్రోయేషియాకు ఎట్టకేలకు ఆ అవకాశం దక్కింది. దీంతో ఇప్పుడది షెన్‌జెన్ ప్రాంతంలో భాగమైంది. 2023 జనవరి 1 నుండి షెన్‌జెన్ వీసా ఉన్న ప్రయాణికులు క్రోయేషియాను కూడా సందర్శించే అవకాశం ఉంది. అయితే, ఆ దేశంలోకి ప్రవేశించాలంటే సరిహద్దుల వద్ద చెకింగ్ మినహాయింపు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తున్నా విమానాశ్రయాల్లో సాంకేతిక సన్నాహాలు మాత్రం మార్చి 26 నుండి అందుబాటులో ఉంటాయి.

క్రొయేషియా చుట్టూ స్లోవేనియా, హంగరీ,సెర్బియా, బోస్నియా, హెర్జెగోవినా, మోంటెనెగ్రో, ఇటలీ వంటి దేశాలు సరిహద్దులు పంచుకున్నాయి. అందులో స్లోవేనియా, హంగరీ, ఇటలీ మాత్రమే షెన్‌జెన్ పరిధిలోకి వచ్చే దేశాలు.

షెన్ జోన్ అంటే...

షెన్‌జెన్ జోన్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద వీసా రహిత ప్రదేశం లేదా ప్రాంతం. ఇందులో ఇదివరకు 26 దేశాలు భాగమవ్వగా తాజాగా క్రోయేషియా చేరికతో 27 దేశాలు ఈ షెన్‌జెన్ పరిధిలోకి వస్తాయి. అంటే మీకు ఈ షెన్‌జెన్ వీసా ఉన్నట్లైతే 27 దేశాలను చుట్టిరావచ్చన్నమాట. మరోవైపు ఈ దేశాలన్నీ చాలా వరకు ఒకదానితో ఒకటి సరిహద్దులు పంచుకుంటున్న నేపథ్యంలో చాలా తేలిగ్గా ప్రయాణాలు సాగించొచ్చు. అవసరమైతే విమానాల్లో వెళ్లొచ్చు. లేదా రైళ్లు, ఓడలు, రోడ్డు మార్గంలోనూ వెళ్లొచ్చు. 180 రోజుల వ్యవధి గల ఈ షెన్‌జెన్ వీసాలో పర్యాటకులు ఎవరైనా నిరంతరాయంగా 90 రోజుల పాటు యూరప్ దేశాల్లో ఎక్కడైనా ఉండొచ్చు. దీంతో అంతర్జాతీయ ప్రయాణీకులు చాలా తక్కువ సమయంలో ఎక్కువ దేశాలను చుట్టేయొచ్చు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :