ASBL NSL Infratech

అమెరికాకు హెచ్చరిక... అలా చేస్తే ధ్వంసం చేస్తాం

అమెరికాకు హెచ్చరిక... అలా చేస్తే ధ్వంసం చేస్తాం

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అమెరికాకు హెచ్చరికలు పంపారు. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఇటీవల ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. ఈ మేరకు కొరియా రక్షణ శాఖ స్పందించింది. మా అంతరిక్ష ఆస్తులపై వాషింగ్టన్‌ దాడులకు ప్రయత్నిస్తే మేం ఆ దేశ నిఘా శాటిలైట్లను ధ్వసం చేస్తాం. అలాంటి చర్యలను యుద్ధ ప్రకటనగా భావిస్తాం అని అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరికలు చేసింది. నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్‌ ప్రభుత్వం గతంలో రెండుసార్లు విఫలయత్నాలు చేసింది. అయితే ఈ నెల ప్రారంభంలో రష్యా సహకారంతో శాటిలైట్‌ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. గతవారం ఈ  ప్రయోగం జరగ్గా కిమ్‌ లాంచింగ్‌ను వీక్షించారు. ఈ ప్రయోగంతో దక్షిణ కొరియా, జపాన్‌, అమెరికా దేశాలు తమ సైన్యాన్ని అప్రమత్తం చేశాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :