ASBL NSL Infratech

క‌ల్కి కోసం కొత్త రిలీజ్ డేట్?

క‌ల్కి కోసం కొత్త రిలీజ్ డేట్?

అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇప్ప‌టికే ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ క‌ల్కి 2898 ఏడీ రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యేది. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లేట‌వ‌డంతో పాటూ ఎల‌క్ష‌న్స్, ఐపీఎల్ హ‌డావుడిని దృష్టిని పెట్టుకుని ముందు అనుకున్న మే 9న రిలీజ్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని భావించి వాయిదా వేసింది. కానీ ఈ విష‌యాన్ని ఇంకా అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌లేదు.

కొత్త డేట్ ను ఫిక్స్ చేశాక డైరెక్ట్ గా ఆ డేట్ ను రిలీజ్ అని అనౌన్స్ చేద్దామ‌ని చూస్తున్నారు. కానీ ఈ విష‌యంలో టీమ్ ఎంత‌కీ ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతుంది. క‌ల్కి రిలీజ్ డేట్ తో చాలా విష‌యాలు ముడిప‌డి ఉండ‌ట‌మే దానిక్కార‌ణం. ఓ వైపు బ‌య్య‌ర్లు ఒక డేట్ చెప్తుంటే, మ‌రోవైపు డిజిట‌ల్ రైట్స్ తీసుకున్న సంస్థ ఫ‌లానా టైమ్ లో రిలీజ్ చేయాల‌ని కండిష‌న్ పెడుతుంద‌ట‌. టీమ్ కూడా రిలీజ్ డేట్ విష‌యంలో ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ అంశాల‌న్నింటినీ ప‌రిశీలించాక క‌ల్కి టీమ్ ఓ కొత్త డేట్ ను ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. జూన్ 27న క‌ల్కి సినిమాను ఆడియ‌న్స్ ముందుకు తీసుకురావాల‌ని చూస్తున్నార‌ట మేక‌ర్స్. కానీ బ‌య్య‌ర్లేమో మే చివ‌ర్లోనే రిలీజ్ చేయాల‌ని అంటుంటే, ఆ టైమ్ కు సినిమాను రెడీ చేయ‌డం క‌ష్ట‌మ‌నే ఆలోచ‌న‌తో మేక‌ర్స్ మాత్రం జూన్ చివ‌రి వారం మీద‌నే ఫోక‌స్ పెట్టార‌ట‌. ఆల్మోస్ట్ ఈ డేట్ నే ఫిక్స్ చేయొచ్చంటున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే ఛాన్సుంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :