ASBL NSL Infratech

రివ్యూ : 'నేను స్టూడెంట్ సర్!'  కాన్సెప్ట్‌ హైలెట్ ట్రీట్ మెంట్ పూర్ సర్!

రివ్యూ : 'నేను స్టూడెంట్ సర్!'  కాన్సెప్ట్‌ హైలెట్ ట్రీట్ మెంట్ పూర్ సర్!

తెలుగు టైమ్స్.నెట్  రేటింగ్ : 2.25/5
బ్యానర్ : ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్స్,
నటీనటులు : బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సినిమాటోగ్రఫీ: అనిత్ కుమార్ మదాడి, సంగీతం : మహతి స్వర సాగర్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, రచన : కృష్ణ చైతన్య
నిర్మాత : నాంది సతీష్ వర్మ, దర్శకత్వం : రాకేష్ ఉప్పలపాటి
విడుదల తేదీ: 02.06.2023

మొదటి సినిమా ‘స్వాతిముత్యం’తో మంచి పేరు తెచ్చుకున్న హీరో బెల్లంకొండ గణేష్. తన అన్నయ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తరహాలో మాస్ బాట పట్టకుండా విభిన్న తరహా కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. టీజర్, ట్రైలర్లతోనే ‘నేను స్టూడెంట్ సర్’ మంచి థ్రిల్లర్ కథాంశంగా ఆకట్టుకుంది. ఒక సెల్ ఫోన్, దాని చుట్టూ తిరిగే క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. పలు మార్లు వాయిదా తర్వాత ఫైనల్ గా ఇప్పుడు ఈ చిత్రం ఈ రోజు రిలీజ్అయ్యింది.  మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా రివ్యూ లో చూద్దాం!

కథ :

సుబ్బారావు (బెల్లంకొండ) కాలేజ్ స్టూడెంట్. ఐఫోన్ 12 అంటే అతనికి మహా  పిచ్చి. తొమ్మిది నెలలు కష్టపడి రూ.90 వేలు సంపాదించి ఐఫోన్ 12 కొనుక్కుంటాడు. సరిగ్గా ఫోన్ కొన్న రోజునే కాలేజీలో గొడవ జరిగి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ పోలీసులు సుబ్బు ఫోన్ కలెక్ట్ చేసుకుంటారు. ఈ ఫోన్ కొన్నాక దాని వల్ల ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అంతే కాకుండా తన బ్యాంక్ అకౌంట్ లో భారీ అమౌంట్ కూడా పడడం తో తన చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తుంది. తన ఫోన్ కోసం తిరిగి వెళ్లినప్పుడు అక్కడ సుబ్బు ఫోన్ దొరకదు. దీంతో సుబ్బు ఈ విషయం మీద కమిషనర్ అర్జున్ వాసుదేవన్‌కు (సముద్రఖని) కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్తాడు. అతను కూడా పట్టించుకోకపోవడంతో కమిషనర్ కూతురు శ్రుతి వాసుదేవన్‌తో (అవంతిక దాసాని) ఫ్రెండ్‌షిప్ చేసి ఫోన్ దక్కించుకోవాలి అనుకుంటాడు. ఫోన్ కోసం చేసిన ఫ్రెండ్‌షిప్ సుబ్బు మీద మర్డర్ కేస్ పడేలా ఎలా చేసింది? ఈ కేసు నుంచి సుబ్బు ఎలా బయటపడ్డాడు? తన ఫోన్ దొరికిందా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

బెల్లంకొండ గణేష్ ఫస్టాఫ్‌లో అమాయకుడిగా, సెకండాఫ్‌లో ఇంటెలిజెంట్‌గా పర్వాలేదనిపిస్తాడు. రొటీన్ కథలు ఎంచుకోకుండా విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ఈ రెండో సినిమా చేసాడు. తన మొదటి సినిమా కంటే ఇందులో బెటర్ గా తనని తాను ప్రెజెంట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని చెప్పాలి. ఓ యంగ్ ఇనోసెంట్ స్టూడెంట్ గా అయితే సెన్సిబుల్ పెర్ఫామెన్స్ ని తాను ఈ చిత్రంలో కనబరిచాడు. శ్రుతి వాసుదేవన్ పాత్రలో అవంతికా దాసాని జస్ట్ ఓకే. తన డైలాగ్స్‌కు లిప్ సింక్ లేకపోవడం పెద్ద మైనస్. అలాగే వెర్సటైల్ నటుడు కమిషనర్‌గా సముద్రఖని ఎప్పటిలానే నటించాడు. సునీల్ కాసేపు నవ్విస్తాడు. జబర్దస్త్ రాంప్రసాద్‌కు కొంచెం కొత్త తరహా పాత్ర లభించింది కానీ అందులో నటనకు ఏమాత్రం స్కోప్ లేదు. శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

దర్శకుడు రాఖి ఉప్పలపాటి విషయానికి వస్తే.. తాను ఈ థ్రిల్లర్ ని పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేయలేకపోయారని చెప్పాలి. సినిమాలో మంచి థీమ్ ఉన్నప్పటికీ కూడా దానిని చాలా అనవసర సన్నివేశాలతో నింపేసి చాలా సమయాన్ని వేస్ట్ చేశారు. బెటర్ సీన్స్ ని ఈ థ్రిల్లర్ డ్రామాలో ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. కరెక్ట్ నరేషన్, స్క్రీన్ ప్లే గాని పడి ఉంటే ఈ సినిమా అవుట్ పుట్ మరింత బెటర్ గా వచ్చి ఉండేది.   మహతి స్వర సాగర్ సంగీతం చాలా బాగుంది. అలాగే తన మాయే మాయే సాంగ్ విజువల్ గా కూడా  బాగుంది. ఇక అనిత్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గా ఉంది. ఇంకా ఎడిటింగ్ వర్క్ బాగాలేదు, సినిమాలో డైలాగ్స్ కూడా బెటర్ చేయాల్సింది. డబ్బింగ్ లో జాగ్రత్తలు లేవు. టెక్నికల్ టీం లో అయితే మహతి స్వర సాగర్ సంగీతం బాగుంది. అలాగే తన మాయే మాయే సాంగ్ విజువల్ గా బాగుంది. ఇక అనిత్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గా ఉంది. ఇంకా ఎడిటింగ్ వర్క్ బాగాలేదు, సినిమాలో డైలాగ్స్ కూడా బెటర్ చేయాల్సింది. డబ్బింగ్ లో జాగ్రత్తలు లేవు.

విశ్లేషణ :

‘నేను స్టూడెంట్ సర్’ సినిమాకు తీసుకున్న కాన్సెప్ట్‌నే మెయిన్ హైలెట్.  ట్రైలర్‌లో చూపించినట్లు కేవలం పోగొట్టుకున్న ఐఫోన్ చుట్టూ మాత్రమే తిరిగే కథ కాదు ఇది. సమ్‌థింగ్ స్పెషల్ అనిపించే ఈ కాన్సెప్ట్‌ను ప్రమోషన్లలో ఎక్కడా రివీల్ చేయలేదు. అయితే అక్కడి దాకా వెళ్లేందుకు సినిమాను బాగా సాగదీశారు. ముఖ్యంగా ప్రథమార్థంలో అయితే కథ ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు. సరిగ్గా ఇంటర్వల్ దగ్గర నుంచే కథ ప్రారంభం అవుతుంది. కథాంశం ఇంట్రస్టింగ్‌గా ఉన్నప్పటికీ ట్రీట్‌మెంట్ వల్ల ఈ ‘స్టూడెంట్’ దెబ్బ తిన్నాడు.  సరైన స్క్రీన్ ప్లే లేదు, దర్శకుని వైఫల్యం కనిపిస్తుంది.  కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా మాత్రం కాదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :