ASBL NSL Infratech

నాట్స్‌ డల్లాస్‌ తెలుగు వేడుకలు - మన ఇంటి వేడుకలు!!

నాట్స్‌ డల్లాస్‌ తెలుగు వేడుకలు - మన ఇంటి వేడుకలు!!

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్‌ మార్చి నెలలో డల్లాస్‌ లో తెలుగు వేడుకలు ఘనంగా నిర్వహించాలని  నిర్ణయించింది. మార్చి 15, 16 తేదీల్లో అలెన్‌ ఈవెంట్‌ సెంటర్‌ (క్రెడిట్‌ యూనియన్‌ ఆఫ్‌ టెక్సాస్‌) వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు నాట్స్‌ అధ్యక్షులు బాపయ్య చౌదరి(బాపు)నూతి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా  ఘనమైన కళా వైభవం, సుమధుర సంగీతం, అద్భుత నాట్య నైపుణ్యం, సినీతారల తళుకులు, పసందైన భోజనంతోపాటు  వైవిధ్య విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నాట్స్‌ డల్లాస్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో పిల్లలూ, పెద్దలూ, బంధుమిత్రులందరికీ స్వాగతం! శుభ స్వాగతం పలుకుతున్నట్లు ఆయన తెలిపారు.

డల్లాస్‌ తెలుగు వేడుకలు - ఇవి మన ఇంటి వేడుకలు
అందరూ ఆహ్వానితులే ఇక ఆలస్యమెందుకు?

పసందైన భోజనం, ఘనమైన కళా వైభవం
సుమధుర సంగీతం, అధ్బుతమైన నాట్య నైపుణ్యం

సినీతారల తళుకులు, వైవిధ్యమైన విక్రయ కేంద్రాలు 
హాస్య నటుల గుళికలు, చిన్నారుల కళా ప్రదర్శనలు

నటకిరీటి చమక్కులు, అందాల అంజలి హొయలు
కార్తిక్ బృందం చే గాన కచేరీ శ్రుతి లయలు

అలరించటానికి NATS Dallas తెలుగు వేడుకలు సిద్ధం
ఆత్మీయమైన ఆతిథ్యం, పలుకుతోంది స్వాగతం

తెలుగువారందరికీ ఇదే మా ఆహ్వానం!
Dallas వేడుకలు, తెలుగుదనానికి సంతకం!!
For more details, please visit https://natsworld.org/dtv24

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :