ASBL NSL Infratech

నారాయణమూర్తి మనవడికి జాక్ పాట్.. ఒక్క రోజులోనే

నారాయణమూర్తి మనవడికి జాక్ పాట్.. ఒక్క రోజులోనే

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి ఐదు నెలల మనవడు ఏకాగ్రప్‌ా రోహన్‌ మూర్తి మరింత సంపన్నుడు కానున్నాడు. తాత బహుమానంగా ఇచ్చిన కంపెనీ షేర్ల ద్వారా ఊహ తెలియకముందే కోట్లాది రూపాయలకు యజమానిగా మారిన ఈ చిన్నారి,  ఇప్పుడు మరో రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ వార్షిక డివిడెండ్‌ ప్రకటించడమే ఇందుకు కారణం.  2023`24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను ఇన్పోసిస్‌ ప్రకటించింది దీంతో పాటు రూ.20 తుది డివిడెండ్‌, మరో రూ.8 ప్రత్యేక డివిడెండ్‌ ప్రకటించింది. అంటే ఒక్కో షేరుకు రూ.28 చొప్పున డివిడెండ్‌గా చెల్లించాలని ఇన్ఫీ నిర్ణయించింది. ఇందుకు మే 31 రికార్డు డేట్‌గా పేర్కొంది. ఈ ఏడాది జులై 1న చెల్లింపులు చేయనుంది. అలా నారాయణమూర్తి మనవడైన రోహన్‌ కూడా డివిడెండ్‌ రూపంలో రూ.4.2 కోట్లు అందుకోనున్నాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :