ASBL NSL Infratech

జెర్సీ సీక్వెల్ గురించి నాని ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్

జెర్సీ సీక్వెల్ గురించి నాని ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్

వరుస స‌క్సెస్ ల‌తో నేచుర‌ల్ స్టార్ నాని త‌న కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. నాని కెరీర్లో ఎన్ని హిట్ సినిమాలున్న‌ప్పటికీ జెర్సీ మాత్రం సంథింగ్ స్పెష‌ల్. ఆ సినిమాకు ఓ స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నానిలోని స‌రికొత్త న‌టుడిని ఆ సినిమా ఆవిష్క‌రించింది. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా బాలీవుడ్ లో కూడా రీమేక్ అయిన విష‌యం తెలిసిందే.

అలాంటి సంథింగ్ స్పెష‌ల్ సినిమాకు సీక్వెల్ చేస్తే బావుంటుంద‌నే కామెంట్స్ చాలాసార్లు వినిపించాయి. ఈ విష‌యాన్ని రీసెంట్ గా ఫ్యాన్స్, నానిని అడిగారు. అల్ల‌రి న‌రేష్ న‌టించిన ఆ ఒక్క‌టి అడ‌క్కు ట్రైల‌ర్ లాంచ్ లో ఈవెంట్ లో నాని పాల్గొన్న విష‌యం తెలిసిందే. అందులో నాని మాట్లాడుతున్న‌ప్పుడు ఫ్యాన్స్ అంద‌రూ జెర్సీ2 ఎప్పుంటూ గ‌ట్టిగా అరిచారు.

ఆ ప్ర‌శ్న‌కు నాని ఎవ‌రూ ఊహించ‌ని స‌మాధాన‌మిచ్చాడు. అందులో నేను లేనుగా.. అయిపోయింది! ఇప్పుడు ఎవ‌రితో చేసుకుంటారో చేసుకోండ‌ని స‌ర‌దాగా స‌మాధాన‌మిచ్చాడు నాని. అయితే నాని చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. జెర్సీ మూవీలో నాని చేసిన అర్జున్ పాత్ర చ‌నిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ సీక్వెల్ చేస్తే అందులో నాని క్యారెక్ట‌ర్ ను ఏమ‌ని చూపిస్తారు? ఎలా చూపిస్తార‌నేది ఆలోచించాల్సిన విష‌యం. డైరెక్ట‌ర్ కూడా జెర్సీ సీక్వెల్ గురించి పెద్ద‌గా క్లారిటీ ఇచ్చింది లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :