ASBL NSL Infratech

మ‌రోసారి వార్త‌ల్లోకి చైతూ, శోభిత‌

మ‌రోసారి వార్త‌ల్లోకి చైతూ, శోభిత‌

సోష‌ల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండే సెల‌బ్రిటీల్లో నాగ చైత‌న్య ఒక‌డు. అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌య‌మైన చైత‌న్య‌, టాలీవుడ్ లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను ద‌క్కించుకుని కెరీర్ లో ముందుకెళ్తున్నాడు. నాగ చైత‌న్య కొన్నేళ్ల కిందట స‌మంత‌ను పెళ్లి చేసుకుని, ఆ త‌ర్వాత ఇద్ద‌రూ విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే.

విడాకుల త‌ర్వాత ఇద్ద‌రూ ఎవ‌రి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. అయితే నాగ‌చైత‌న్య మాత్రం యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని, ఆ మ‌ధ్య వీరిద్ద‌రూ క‌లిసి వెకేష‌న్ కు కూడా వెళ్లిన‌ట్లు ఫోటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. గ‌త కొన్నేళ్లుగా చైతూ, శోభిత డేటింగ్ లో ఉన్నార‌ని అంద‌రూ అంటుంటారు. కానీ వాళ్లిద్ద‌రూ మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌న్నీ కేవ‌లం రూమ‌ర్లేన‌ని కొట్టిపారేస్తుంటారు.

తాజాగా వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే ప్ర‌చారం మ‌ళ్లీ మొద‌లైంది. దానికి కార‌ణం రీసెంట్ గా చైతూ ఇన్‌స్టా లో పెట్టిన ఫోటోను శోభిత లైక్ చేయ‌డం. అదితి- సిద్దార్థ్ లా వీరిద్ద‌రూ కూడా స‌డెన్ గా షాకిస్తారేమో అని అంద‌రూ అంటున్నారు. ఆ ఫోటో శోభితానే తీసుంటుంద‌ని కొంద‌రంటుంటే, ఇద్ద‌రూ క‌లిసి మ‌రోసారి వెకేష‌న్ కు వెళ్లుంటార‌ని మ‌రికొంద‌రంటున్నారు. ఏదేమైనా ఈ విష‌యంలో వీరిద్ద‌రూ ఓపెన్ గా ఒక్క‌సారి స్టేట్‌మెంట్ ఇస్తే ఏ గోలా లేకుండా ఉంటుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డుతున్నారు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :