ASBL NSL Infratech

తమ్ముడు కోసం మెగాస్టార్ రంగంలోకి దిగుతారా..

తమ్ముడు కోసం మెగాస్టార్ రంగంలోకి దిగుతారా..

మెగాస్టార్ చిరంజీవి.. ఒకప్పుడు ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి ఆ తరువాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కొంతకాలం రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్నా.. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రస్తుతం తాను పాలిటిక్స్ కి దూరంగా ఉన్నానని.. సినిమాలే తన జీవితమని చిరంజీవి అన్నారు.అయితే ఇంగువ మూట కట్టిన గుడ్డ సంవత్సరాలు గడిచిన దాని వాసన ఎలా మర్చిపోదో.. రాజకీయాలలోకి ఒకసారి వచ్చిన వ్యక్తి ఆ ఆలోచనలను అలాగే మర్చిపోలేరు. పైగా సొంత తమ్ముడు ఇప్పుడు పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ న్యూట్రల్ గా ఎలా ఉండగలరు చెప్పండి. కనీసం తమ్ముడి కోసం అయినా ప్రచారంలోకి దిగక మానుతారా అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. పైగా ఈసారి ఎన్నికలు పవన్ పొలిటికల్ కెరీర్ కి పెద్ద పరీక్షగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రియమైన తమ్ముడిని మెగాస్టార్ ఎలా వదిలిపెడతాడు.

కనీసం పిఠాపురంలో గెలిపించడానికి అయిన తన క్రేజ్ వాడకుండా ఉంటాడా. దీనికి తోడు ఇటీవల చిరంజీవి ఇంటికి రమేష్ వెళ్లడం ఈ విషయాలకే బలాన్ని చేకూరుస్తుంది. పక్క టీడీపీ వాది అయిన రమేష్ కెరీర్ కు ముఖ్య కారణం చంద్రబాబు. బిజెపిలో చేరిన తర్వాత అతనికి అనకాపల్లి ఎంపీ టికెట్ దక్కడం వెనక కూడా బాబు హస్తం ఉంది అని అంటారు. ఈ నేపథ్యంలో రమేష్ చిరంజీవిని కలవడం వెనుక బాబు వ్యూహం ఉంది అన్న మాట కూడా వినిపిస్తోంది. అంటే తొందరలో తమ్ముడి తరఫున అన్న ఎంట్రీ ఇస్తారేమో చూడాలి..

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :