ASBL NSL Infratech

కదులుతున్న మంచుకొండ.. ప్రపంచంలోనే అతిపెద్ద!

కదులుతున్న మంచుకొండ.. ప్రపంచంలోనే అతిపెద్ద!

అంటార్కిటికా నుంచి విడిపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ మహాసముద్రంలో ముందుకు కదులుతున్నది. ఏ23ఏ గా పిలుస్తున్న ఈ ఐస్‌బర్గ్‌ న్యూయార్క్‌ నగరమంత పరిమాణంలో ఉన్నదని, మూడు దశాబ్దాల తర్వాత మొదటి సారి ముందుకు కదులుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దాదాపు 4 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ కొండ అంటార్కిటికా మహాసముద్రంలో ప్రమాదకరంగా మున్ముందుకు దూసుకెళ్తున్నట్టు తేల్చారు. ఇది పశ్చిమ అంటార్కిటికా నుంచి 1986లో విడిపోయింది. అప్పటినుంచీ కదలకుండానే ఉన్నది. అయితే ట్రిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బరువున్న ఈ మంచుకొండ బలమైన గాలులు, ప్రవాహాల వల్ల ఇటీవల అంటార్కిటికా ద్వీపకల్పం ఉత్తరకొనను దాటి ముందుకు కదుతులుతున్నట్టు గుర్తించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :