ASBL NSL Infratech

ప్రకృతి ఒడిలో పూల పండుగ

ప్రకృతి ఒడిలో పూల పండుగ

ఈరొజు ముద్దపప్పు బతుకమ్మ (3వ రోజు)! పెద్దలకు, పిల్లలకు, అక్కలకు, అన్నలకు, అమ్మలకు మరియు మిత్రులందరికీ దుర్గా శరన్నవ నవ రాత్రుల శుభాకాంక్షలు. ప్రపంచములొ పూలతో పూలను పూజించే సంప్రదాయం మన తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ ఒక్కటే. ప్రకృతి లో మన బతుకమ్మ పండుగను సంప్రదాయ పద్దతిలో చెరువు పక్కన చిన్న పెద్ద అడపఢుచులు బతుకమ్మ ఆడి పాడి చెరువు లో బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చెయటం మన ఆనవాయితి.

మన కన్సాస్ సిటి తెలంగాన కల్చర్లల్ అసోసియెషన్ తరపున అక్టోబర్ 9 వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మన హెరిటేజ్ పార్క్ లొ జరపబొయే 15 వ వార్షికోత్సవ బతుకమ్మ పండుగ సంబరాలకి మీకు ఇదే ఆహ్వానం. ప్రముఖ జనపద కళాకారుడు జనార్ధన్ పన్నెల హుషారైన సాంప్రదయమైన బతుకమ్మ మరియు జానపద పాటలను పాడి మన బతుకమ్మ పండుగను వైభవం గా జరిపించటానికి వస్తున్నారు. ఈ ఈవెంట్ పూర్తిగ ప్రకృతిలో లేక్ పక్కన చెట్ల మద్యలో మంచి గాలి వెలుతురులో జరపబడుతుంది.

మీ అందరకి ఇదే మీకు ఆహ్వానం!!!

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :