ASBL NSL Infratech

కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనంపై నోరు విప్పిన కేసీఆర్

కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనంపై నోరు విప్పిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఇస్తే బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామంటూ అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యానించి ఆ తర్వాత నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేసీఆర్‌ను విపక్షాలు ఈ నాటికీ విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా కేసీఆర్ దీనిపై స్పందించారు. మంగళవారం ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తామని చెప్పిన మాట నిజమేనని.. కానీ, అప్పట్లో తన డిమాండ్లకు కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే విలీనానికి నిరాకరించానని వెల్లడించారు.

‘‘ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచాం. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించాం. ఇప్పుడు మళ్లీ ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. కానీ, ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది. వంద రోజుల్లోనే వారి పనితీరుపై ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. రాష్ట్ర ప్రజలు రియలైజ్ అవుతున్నారు. మోసపోయినట్లు అర్థం చేసుకుంటున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీలు అమలు చేయడం చేతకాక, బీఆర్ఎస్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతోంది. అందుకే ఆ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు’’ అంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :