అభిమానుల మధ్య ఘనంగా జరిగిన జయరాం కోమటి జన్మదిన వేడుకలు

బే ఏరియా ప్రముఖుడు ఎన్నారై టీడిపి నాయకుడు, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి 66వ జన్మదిన వేడుకలు అభిమానుల సందడి నడుమ శశి దొప్పలపూడి వ్యవసాయ క్షేత్రంలో వైభవంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ అభిమానులు, వివిధ తెలుగు సంఘాలకు చెందిన వాళ్లు మరియు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకాంత్ దొడ్డపనేని, కళ్యాణ్ కోట, లక్ష్మణ్ పరుచూరి ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ ఆంజనేయులు, శశి దొప్పలపూడి, లియోన్ బోయపాటితో కలసి సమన్వయపరిచారు. జయరాంకి అత్యంత సన్నిహితుడైన సుబ్బా యంత్రా, అమరావతిపై ఇటీవల ‘కందుల రమేష్’ రచించిన ‘అమరావతి వివాదాలు-వాస్తవాలు’ పుస్తకాన్ని ఇండియా నుండి తెప్పించి జయరాంకి బహుకరించారు. తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు అభినందన పత్రాన్ని అందించారు.
మన్నవ సుబ్బారావు, ఎల్వీఎస్‌ఆర్కే ప్రసాద్, స్వరూప్ వాసిరెడ్డి, భక్త బల్లా, చంద్ర గుంటుపల్లి, వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల, వెంకట్ కోడూరి, గంగ కోమటి, సతీష్ బోళ్ళ, విజయ ఆసూరి, శ్రీలు వెలిగేటి, శ్రీదేవి, భాస్కర్ వల్లభనేని, రామ్ తోట, వీరు ఉప్పల, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, ప్రసాద్ మంగిన, గోకుల్ రాచిరాజు, భరత్ ముప్పిరాల, సుధీర్ ఉన్నం, విజయకృష్ణ గుమ్మడి, వెంకట్ అడుసుమల్లి, తిరుపతి రావు, బెజవాడ శ్రీను, వీరబాబు, శ్రీధర్ చావా, సూర్య కోటప్రోలు, సురేష్ ద్రోణవల్లి, కాసి సుంకర, సురేష్ రెడ్డి, సందీప్ ఇంటూరి, శివప్రసాద్ తదితరులు ఉన్నారు.