ASBL NSL Infratech

ఇండియన్ ఎంబసీ కీలక సూచన.. దుబాయ్ ప్రయాణాలను

ఇండియన్ ఎంబసీ కీలక సూచన.. దుబాయ్ ప్రయాణాలను

దుబాయ్‌లో వరదల నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది.  దుబాయ్‌కు వచ్చేవారు, స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్‌ చేసుకోవాలని తాజా అడ్వైజరీలో పేర్కొంది. భారీ వరదల నేపథ్యంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఈ సూచనలు పాటించాలని తెలిపింది. దుబాయ్‌తో పాటు సమీప ప్రాంతాలను ఇటీవల వరదలు ముంచెత్తాయి. ఊహించని వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఇన్‌బౌండ్‌ విమానాల సంఖ్యను పరిమితం చేసింది. కార్యకలాపాలు సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు యూఏఈ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విమానాలు బయలుదేరీ తేదీ, సమయానికి సంబంధించి సదరు విమానాయన సంస్థ నుంచి ధ్రువీకరణ వచ్చిన తర్వాతే ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :