ASBL NSL Infratech

కమనీయంగా గాటా ఉగాది వేడుకలు

కమనీయంగా గాటా ఉగాది వేడుకలు

గ్రేటర్‌ అట్లాంటా తెలుగు సంఘం వారి ఉగాది వేడుకలు అయోధ్యరాముని ఉరేగింపుతో, ఆటపాటలతో కమనీయంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్‌ SplashBI వారి సహాయ సహకారంతో, ఏప్రిల్‌ 13న దేశానా మిడిల్‌ స్కూల్‌లో వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకకు దాదాపు 1800 మందికి పైగా విచ్చేశారు. తెలుగు వారి సాంప్రదాయా పద్ధతిలో గణనాథుని ఆరాధన, జ్యోతి ప్రజ్వలన శ్రీకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నోరూరించే షడ్రుచుల ఉగాది పచ్చడి..వినోదాత్మక రీతిలో యాంకరింగ్‌ చేసిన లావణ్య గూడూరు, లక్మీ మండవల్లిల అల్లరి ముచ్చటలతో మునగితేలారు.

ఈ ఈవెంట్‌లో దాదాపు 200 మంది చిన్నారుల ఆట పాటల సందడి, అతిధుల సాంప్రదాయ వస్త్రదారణ, విభిన్న కళా ప్రదర్శనలు ఆద్యంతం ఆహుతులను మంత్ర ముగ్దుల్ని చేశాయి. ఈ వేడుకలో పాల్గొన్న వారికి ఫుడ్‌ స్పాన్సర్లు ప్రశాంత్‌, బిర్యాని హౌస్‌ మహేష్‌ స్టాప్‌ ఈట్‌ రిపీట్‌  వారు నోరూరించే కమ్మని వంటకాలను అందించారు. ఈ కార్యక్రమంలో దుర్గ  మ్యూజికల్‌ కన్సర్ట్‌తో అఖిల్‌ అందించిన డీజే మ్యూజిక్‌ తో ఆడిటోరియం దద్దరిల్లింది. గాయని అంజనా సౌమ్యా తన గాన మాధుర్యంతో వచ్చినవారిని రంజిపజేశారు. హృదయాన్ని హత్తుకునే ఆత్మీయ పలుకరింపులతో గాటా బృందం అభిమానాన్ని పంచగా, కనులకు ఇంపైన కార్యక్రమాలతో వేదిక ఆకట్టుకోగా, పుడ్‌ స్పాన్సర్లు 
 ప్రశాంత్‌ - బిర్యానీ హౌజ్‌, మహేష్‌ స్టాప్‌ ఈట్‌ రిపీట్‌ వారి పలురకాల పలహారాలాతో, నోరూరించే కమ్మని పదార్ధాలతో అందరి మనసులు ఆనందోత్సాహాలలో మునిగితేలాయి.  

గాయని సౌమ్య, దుర్గ మ్యూజికల్‌ కన్సర్ట్‌ తో అఖిల్‌ అందించిన దద్దరిల్లే డిజె తో వేడుక వాతావరణాన్ని మరియు ప్రేక్షకుల ఉత్సాహాన్ని వేయిరెట్లు ఉత్తేజభరితం కావించింది అనడంలో అతిశయోక్తి లేదు. గాయకులు ఊపందించే పాటలతో మైమరిపించే గాత్రంతో మాయ చేయగా, తన్మయంతో పిల్లలతోపాటు పెద్దలు కూడా చిందులేయడం అపురూప అనుభూతిని కలిగించింది. కొసమెరుపుగా శ్రీ రాములవారి రథం తరలిరావడం, అక్షింతల ప్రసాదాల ఆశీర్వాదాలు వచ్చినవారిని భక్తి పారవశ్యములో ముంచెత్తింది.

గాటా ఇసి, బోర్డు, సభ్యులకు, సహకారులకు, సంస్థ శ్రేయోభిలాషులకు, విశిష్ఠ అతిథులకు మరియు విచ్చేసిన అతిథులందరికీ గాటా అధ్యక్షురాలు స్వప్న కస్వా పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేశారు.

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :