విలన్లకు అంతే అంటూ..చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జగన్..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజుకు ఒక కొత్త అంశంతో ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. రాజకీయ నాయకులు ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు టీవీ సీరియల్ డైలాగులను మించి ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నాయి. చంద్రబాబు జగన్ గురించి విమర్శించిన మరుసటి నిమిషం ప్రజలు జగన్ దానికి ఎటువంటి రిటార్ట్ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. అదే రకంగా జగన్ టీడీపీ, జనసేన గురించి మాట్లాడినప్పుడు అవతల పక్క నుంచి ఎటువంటి సమాధానం వస్తుందా అని కూడా జనం ఎదురుచూస్తున్నారు. తాజాగా జగన్ చంద్రబాబు పై సూటిగా ఓ సినిమా డైలాగ్ విసిరారు. గత కొద్ది కాలంగా అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ గురించి మాట్లాడేటప్పుడు బచ్చా ..పిల్ల బచ్చా లాంటి పదాలు ఉపయోగిస్తున్నారు. పవన్ అయితే హలో ఏపీ .. బై బై వైసిపి.. సైకో జగన్ అంటూ హడావిడి చేస్తున్నారు.
ఇప్పటివరకు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎంతో కొంత సంయమనం పాటించిన జగన్ తాజాగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తనని బచ్చా అంటూ విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఏ సినిమాలో చూసినా విలన్ కి హీరోలు ఇలా బచ్చాలు గానే కనిపిస్తారు అంటూ స్ట్రాంగ్ గా ఇచ్చి పడేశారు. అంతేకాదు తన మాటలకి పురాణాల నుంచి రిఫరెన్స్ తీసుకొని..కంసుడు కూడా శ్రీకృష్ణుని బచ్చా అని అనుకున్నాడు.. రావణాసురుడు రాముని కూడా అలాగే అనుకున్నాడు..అయితే చివరికి ఏం జరిగింది అని ప్రశ్నించారు.