ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా కంపెనీలపై చైనా ఆంక్షలు

అమెరికా కంపెనీలపై చైనా ఆంక్షలు

తైవాన్‌కు ఆయుధాలు సమకూరుస్తున్నారని ఆరోపిస్తూ రెండు అమెరికా రక్షణ కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. జనరల్‌ అటామిక్స్‌ ఎరోనాటికల్‌  సిస్టమ్స్‌, జనరల్‌ డైనమిక్‌ ల్యాండ్‌ సిస్టమ్స్‌ అనే రెండు అమెరికా కంపెనీలకు చైనాలో ఉన్న ఆస్తులపై ఆంక్షలు విదించామని తెలిపింది. నిరంతరంగా తైవాన్‌కు కొనసాగుతున్న అమెరికా ఆయుధాల సరఫరా ఒక చైనా సూత్రాన్ని, మూడు చైనా`అమెరికాల ఉమ్మడి నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయి. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మా సార్వభౌమ అధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీయడమే అని బీజింగ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. తైవాన్‌ ద్వీపం చైనాలో అంతర్భాగమేనని మరోసారి నొక్కి చెప్పింది. అవసరమైతే ద్వీపాన్ని బలవంతంగానైనా సొంతం చేసుకుంటామని వ్యాఖ్యానించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :