ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణ బీజేపీలో గందరగోళం..! బీఆర్ఎస్‌తో కుమ్మక్కయిందా...?

తెలంగాణ బీజేపీలో గందరగోళం..! బీఆర్ఎస్‌తో కుమ్మక్కయిందా...?

తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తామేనని చాలా కాలం నుంచి చెప్తూ వస్తోంది బీజేపీ. ఈసారి కేసీఆర్ ను గద్దె దించబోతున్నామని, అవినీతిలో ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని కూడా హెచ్చరిస్తోంది. బీజేపీ నేతల దూకుడు చూసి నిజంగానే కేసీఆర్ ను జైలుకు పంపిస్తారేమోనని చాలా మంది అనుమాన పడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవితను కూడా సీబీఐ కానీ, ఈడీ కానీ అరెస్టు చేయలేదు. దీంతో అసలేం జరుగుతోందో అర్థం కావట్లేదు చాలా మందికి. పైగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణ కూడా నెమ్మదించింది. దీంతో ఏదో జరుగుతోందనే భావన చాలా మందికి కలుగుతోంది.

బీజేపీని బలోపేతం చేయాలని హైకమాండ్ ఆదేశించింది. అందులో బాగంగా చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ పలువురు నేతలను కలిసి తమ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. అలాగే బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావును కలిసి కమలం పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ఈటల రాజేందర్. అయితే వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఈటల రాజేందర్ మైండ్ బ్లాంక్ అయింది. కేసీఆర్ ను ఓడించేందుకు మీ దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటి.. కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు.. కేసీఆర్ బీజేపీ హైకమాండ్ తో లాబియింగ్ చేయడం వల్లే కవిత అరెస్టు ఆగిపోయిందా.. బీజేపీకి లాభం చేకూర్చేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారా... లాంటి ప్రశ్నలు ఈటల ముందు పెట్టారు వాళ్లు. దీనికి ఈటల దగ్గర అప్పటికప్పుడు సమాధానం లేకపోయింది.

ఇలా తెలంగాణ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం కనుక్కునే పనిలో పడ్డారు ఈటల రాజేందర్. ఢిల్లీ వెళ్లి ఇదే అంశాన్ని హైకమాండ్ ముందు ఉంచారు. ఇలా అడుగుతున్న నేతలకు ఏమని సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అయితే అధిష్టానం నుంచి ఈటల ఆశించినట్లు సమాధానాలు రాలేదు. దాటవేత ధోరణి మాత్రమే కనిపించింది. దీంతో ఈటల రాజేందర్ అసహనానికి గురయ్యారు. నేతలను చేర్చుకోమంటారు.. వాళ్ల ప్రశ్నలకు మాత్రం సమాధానాలివ్వరు.. ఇలాగైతే పార్టీని నడిపించడం చాలా కష్టం. పైగా బీజేపీ – బీఆర్ఎస్ కుమ్మక్కయిందనే ఫీలింగ్ జనాల్లోకి వెళ్లిపోతుంది. అప్పుడు పార్టీ మరింత నష్టపోతుందని తేల్చి చెప్పారు.

ఇన్నాళ్లూ బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఉత్సాహం చూపించారు. అయితే ఇప్పుడు చేరిన నేతలు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ బాగా వినిపిస్తోంది. త్వరలోనే బీజేపీ నుంచి పలువురు నేతలు బయటకు రాబోతున్నట్టు సమాచారం. పైగా చేరాలనుకునే నేతలకు కూడా హైకమాండ్ నుంచి భరోసా లేకపోవడంతో మరో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పైగా బీజేపీలో నేతల మధ్య విభేదాలు కూడా తారస్థాయిలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కూడా బలమైన నేతలు లేరు. ఇలాంటప్పుడు పార్టీ అధికారంలోకి రావడం కలేనని చాలా మంది అనుకుంటున్నారు. దీంతో ఈటల లాంటి నేతలు డైలమాలో పడ్డారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :