ASBL NSL Infratech

బీఆర్ఎస్ అంతు చూసే వరకూ రేవంత్ నిద్రపోరా..?

బీఆర్ఎస్ అంతు చూసే వరకూ రేవంత్ నిద్రపోరా..?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు మాత్రమే అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వంద రోజుల్లో తాను అమలు చేస్తానన్న హామీలను అమలులోకి తెచ్చారు. మొదటి వంద రోజులు రేవంత్ రెడ్డి ఆలోచన అంతా పూర్తిగా 6 గ్యారంటీల అమలుపైనే ఉండేది. కానీ వంద రోజులు పూర్తి కాగానే పీసీసీ అధ్యక్షుడిగా ఏం చేయాలో స్కెచ్ వేశారు. పార్టీ బలోపేతానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా నాడు కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేందుకు బీఆర్ఎస్ ఎన్ని పనులు చేసిందో అంతకు మించి రేవంత్ రెడ్డి కథ నడిపిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్ మహాసముద్రంలో ఎంతోమంది ఉద్దండులు ఉన్నారు. కానీ వాళ్లందరినీ కాదని రేవంత్ రెడ్డే సీఎం అని ప్రకటించింది హైకమాండ్. దీంతో కాంగ్రెస్ నేతలంతా ఖంగుతిన్నారు. అయితే కాంగ్రెస్ లో వేరుకుంపట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రేవంత్ పరిపాలన అంత సాఫీగా సాగదని.. మూణ్ణాళ్ల ముచ్చటేనని అందరూ అనుకున్నారు. అయితే రేవంత్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. పార్టీలో అసంతృప్తులందరినీ తన దారికి తెచ్చుకున్నారు. పార్టీని బలోపేతం చేయడం, సంక్షేమ పాలన అందించడంపైనే రేవంత్ ఫోకస్ పెట్టారు.

ఇంతవరకూ బాగానే ఉంది. అయితే వంద రోజుల తర్వాత సరికొత్త రేవంత్ పుట్టుకొచ్చారు. అసలైన రాజకీయం ఆరు గ్యారంటీల అమలు తర్వాత మొదలవుతుందని గతంలోనే చెప్పారు రేవంత్. అందుకు తగ్గట్టుగానే దృష్టంతా బీఆర్ఎస్ పై పెట్టారు. ఆ పార్టీని పునాదులతో సహా కదిలించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలు.. ఇలా వాళ్లూ వీళ్లూ అనే తేడా లేకుండా అందరినీ లాగేస్తున్నారు. కేసీఆర్ కు కుడిభుజం అయిన కె.కేశవరావు, పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్న కడియం శ్రీహరి లాంటి వాళ్లను కూడా రేవంత్ తన దారికి తెచ్చుకున్నాడు. ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన వాళ్లు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిపోతుండడం విశేషం.

సార్వత్రిక ఎన్నికలు ముగిసేలోపు బీఆర్ఎస్ లో మెజారిటీ నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తంది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక తగినంత బలం ఉన్నా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు తెలుస్తోంది. కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ లో పెద్దల హస్తం ఉందనే వార్తలు వస్తుండడంతో నేతలంతా భయపడిపోతున్నారు. అందుకే సేఫ్ జోన్ చూసుకుంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఇస్తున్న షాక్ లకు బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టట్లేదు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :