ASBL NSL Infratech

చిరంజీవి చుట్టూ ఏపీ పాలిటిక్స్..!

చిరంజీవి చుట్టూ ఏపీ పాలిటిక్స్..!

మెగాస్టార్ చిరంజీవి.. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారాయన. సినిమాల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అగ్రస్థానానికి వెళ్లారు. అదే పట్టుదలతో రాజకీయాల్లో కూడా రాణించాలనుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లారు. అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. దీంతో కొంతకాలం తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. మరికొంతకాలానికి పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి సినిమాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా చిరంజీవి ఏపీ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగిలారు.

చిరంజీవి రాజకీయ జీవితం ముగిసింది. ఇక తాను రాజకీయాల జోలికి పోనని.. చివరి శ్వాస వరకూ సినిమాలు చేసుకుంటూ ఉంటానని ప్రకటించారు. అన్నట్టుగానే రాజకీయాల జోలికి వెళ్లలేదు. అయితే ఇండస్ట్రీ తరపున అప్పుడప్పుడు రాజకీయ నేతలను కలుస్తున్నారు. అలాగే ఆయనతో అవసరం ఉన్న పలువురు రాజకీయ నేతలు కూడా అప్పుడప్పుడు ఆయన దగ్గరకు వెళ్లి కలుస్తున్నారు. తాజాగా అనకాపల్లి నేతలు సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్ చిరంజీవిని కలిశారు. ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఆయన ఆశీస్సులు కోరారు. దీంతో కూటమి తరపున పోటీ చేస్తున్న వాళ్లిద్దరినీ గెలిపించాలని చిరంజీవి సూచించారు.

చిరంజీవి కామెంట్స్ రాష్ట్రంలో కలకలం రేపాయి. కూటమిని గెలిపించాలంటూ చిరంజీవి సూచించారంటూ ఆయన అభిమానులు, పవన్ అబిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే చిరంజీవి కామెంట్స్ వైసీపీకి ఏమాత్రం రుచించలేదు. ఆయన్ను విమర్శిస్తూ పలువురు వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు పోస్టులు పెడ్తున్నారు. జగన్ దగ్గరకు వెళ్లిన సినిమా ఇండస్ట్రీ వాళ్లు వెళ్లినప్పుడు మర్యాద లేకుండా ప్రవర్తించారని, అగౌరవపరిచారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.

ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ తో అప్పటి సీన్ మళ్లీ గుర్తు చేస్తున్నారు కూటమి నేతలు. పవన్ కల్యాణ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. చిరంజీవి సహా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు జగన్ ఎలాంటి గౌరవం ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. ఇండస్ట్రీ ఎప్పుడూ దాన్ని మర్చిపోదన్నారు. తాజాగీ చంద్రబాబు కూడా చిరంజీవిని విమర్శించే అర్హత వైసీపీ వాళ్లకు ఉందా అని ప్రశ్నించారు. అటు వైసీపీ, ఇటు కూటమి నేతలు ఇద్దరూ ఇప్పుడు చిరంజీవి కేంద్రంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. దీంతో మెగాస్టార్ పాలిటిక్స్ లో లేకపోయినా తానొక టాపిక్ గా మారిపోయారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :