ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వైసీపీ నుంచి అంబటి జంప్.. షాక్ లో పార్టీ పెద్దలు..

వైసీపీ నుంచి అంబటి జంప్.. షాక్ లో పార్టీ పెద్దలు..

ఇంకా ఎన్నికలు షురూ కూడా కాలేదు అప్పుడే వైసీపీకి షాప్ ల మీద షాక్ లు స్టార్ట్ అయినట్లు కనిపిస్తుంది. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొట్టిన షార్ట్ కి వైసీపీ మైండ్ బ్లాక్ అయింది. రీసెంట్ గా వైసీపీ తీర్థం పుచ్చుకున్న అంబటి నెలరోజులు కూడా పార్టీలో నిలవలేక పోయాడు. సడన్ గా పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాదు కొంతకాలం పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు కూడా ప్రకటించారు. మరి ఆ కొంతకాలం ఎంతకాలం అనేది ఎవరికి తెలియదు. ఇక త్వరలో తన భవిష్యత్తుకు సంబంధించి కార్యాచరణ ప్రకటిస్తానని కూడా అంబటి రాయుడు వెల్లడించారు.

చేరడానికి ముందు అంబటి అదేపనిగా జగన్ ను కలిసేవారు. గత కొంతకాలంగా జగన్ ప్రభుత్వానికి సానుకూలంగా ఆయన ప్రకటనలు కూడా చేశారు. సీఎంగా జగన్ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు అంబటి. ఈ నేపథ్యంలో పార్టీలో చేరిన తర్వాత అతనికి వైజాగ్ లేక ఎంపీ సీటు దక్కే అవకాశం ఉంది అని జోరుగా ప్రచారం జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు పార్టీలో చేరడం వచ్చే ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మారుతుంది అని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో అంబటి గుంటూరు బరిలో నిలబడితే కాపుల ఓట్లు వైసీపీకి పడే అవకాశాలున్నాయని పార్టీ పెద్దలు భావించారు.

ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా అంబటి రాయుడు అంటే కాపుల్లో మంచి ఇమేజ్ ఉంది. తాను పార్టీలో చేరడం వల్ల ఆ ఇమేజ్ పార్టీకి పనికి వస్తుంది అన్న ఉద్దేశంతోటే ఆయన్ని చేర్చుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎంతో కొంత ఆసక్తి చూపాయి. అయితే అందరినీ కాదనుకొని అంబటి రాయుడు మాత్రం సీఎం జగన్ వైపు మొగ్గు చూపించాడు. మొదట్లో అంబటి రాయుడికి తగిన ప్రాధాన్యం జగన్ ఇస్తారు అని అందరూ భావించారు. ఇంతకీ విషయం ఏమిటంటే నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు శనివారం నాడు తనని సీఎం గుంటూరు లోకసభ స్థానం నుంచి పోటీ చేయమని కోరినట్లు వెల్లడించారు. మొదట తనకు గుంటూరు టికెట్ కన్ఫామ్ చేసి ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయుల్ని అడగడంపై అంబటి మనస్థాపం చెందినట్టు ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా సరే వైసీపీలో చేరి, చాలా తక్కువ సమయంలో అంబటి ఇలా పార్టీ నుంచి బయటికి రావడం.. అది కూడా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న ఈ సమయంలో  పార్టీపై నెగెటివ్ ప్రభావం పడుతుందనే ఆందోళన వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :