ASBL NSL Infratech

డబ్బింగ్ చెప్తున్న అల్లు అర్హ...

డబ్బింగ్ చెప్తున్న అల్లు అర్హ...

మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం శాకుంతలం. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. శాకుంతల రోల్ లో సామ్ దేవకన్యలా ఉందనే ప్రశంసలు వస్తున్నాయి. ఆ పాత్రకి సామ్ ప్రాణం పోసింది అనే మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

టీజర్ రిలీజయ్యాక సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. శాకుంతల, దుష్యంతుడికి పుట్టిన భరతుడు పాత్రలో అల్లు అర్హ నటించింది. శాకుంతలంకి కొనసాగింపుగా భరతుడు పాత్ర సినిమాలో ఉండబోతుంది. చిన్నప్పటి భరతుడు పాత్రలో అర్హ తెరంగేట్రం చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ పాత్ర కోసం అర్హనే డబ్బింగ్ కూడా చెప్పుకోవడానికి రెడీ అవుతుండడం కొసమెరుపు.

నిజానికి పౌరాణిక సినిమాలకి మాటలు కాస్త  గ్రాంధికంగా, అచ్చమైన తెలుగు భావంతో వినిపించాలి. అలాంటి సంభాషణలు చెప్పడం అంత తేలికైన విషయం కాదు. కాని, అర్హ మాత్రం ఎక్కడా తగ్గేదేలేదంటూ డబ్బింగ్ చెప్పడానికి రెడీ అయిపొయింది. బన్నీ తన ఫోన్ లో అర్హ డబ్బింగ్ చెబుతున్న వీడియోని స్టేటస్ గా పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :