ASBL NSL Infratech

రివ్యూ : హింసాత్మకంగా 'అహింస'

రివ్యూ : హింసాత్మకంగా 'అహింస'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
నటీ నటులు: అభిరామ్ దగ్గుబాటి , గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు
సంగీతం: ఆర్పీ పట్నాయక్, సినిమాటోగ్రఫీ  : సమీర్ రెడ్డి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: సుప్రియ
యాక్షన్ డైరెక్టర్: బివి రమణ, ఫైట్స్: రియల్ సతీష్, కొరియోగ్రఫీ: శంకర్
పాటలు : చంద్రబోస్, మాటలు : అనిల్ అచ్చుగట్ల, నిర్మాత: పి కిరణ్ (జెమిని కిరణ్)
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
విడుదల తేదీ : 02.06.2023

చిత్రం, నువ్వు నేను, జయం వంటి చిత్రాలతో లవ్ చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు తేజ‌. చిత్రం ద్వారా ఉదయ్ కిరణ్, జయం చిత్రం ద్వారా నితిన్ ను,  జై ద్వారా నవదీప్ ను, విలన్ గా గోపి చందును ఇలా తెలుగు తెరకు మంచి నటులను  పరిచయం చేసిన ఘనత తేజాది. ఈ సారి  ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంక‌టేష్, రానా త‌ర్వాత హీరోగా అభిరాం దగ్గుబాటి పరిచ‌యం చేసారు. ‘అహింస’ అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ గ్లింప్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆస‌క్తిని రేకెత్తించింది. మ‌రి ‘అహింస’ చిత్రం ద‌గ్గుబాటి అభిరాంకు మంచి డెబ్యూ మూవీగా నిలిచిందా? ద‌ర్శ‌కుడు తేజకి మరో  హిట్ వచ్చిందా? అస‌లు అహింస‌తో తేజ ఏం చెప్పాల‌నుకున్నారు? అనే విష‌యాల‌ను  తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూడండి!

కథ :

రఘు (దగ్గుబాటి అభిరాం) అహింస సిద్ధాంతాన్ని నమ్మే గౌతమ బుద్దుడిలాంటి యువకుడు.  తల్లిదండ్రులు లేని అతనికి ఉండ‌రు అత్త‌, మామ‌లే పెంచుతారు. మ‌ర‌ద‌లు అహ‌ల్య (గీతికా తివారి)కి బావ ర‌ఘు అంటే ప్రాణం. ర‌ఘుకి కూడా మ‌ర‌ద‌లంటే ఎంతో ప్రేమ ఉంటుంది. ఇద్ద‌రికీ పెళ్లి చేయాల‌ని పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకుంటారు. అదే స‌మ‌యంలో సిటీలో డ‌బ్బున్న వ్య‌క్తి దుష్యంత్ రావు (ర‌జ‌త్ బేడి) ఇద్ద‌రు కొడుకులు అహ‌ల్య ను పాడు చేస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ర‌ఘు హాస్పిట‌ల్‌లో చేరుస్తాడు. అత‌ని అండ‌గా ఓ లేడీ లాయ‌ర్ లక్ష్మి (స‌దా).. ఆమె భ‌ర్త నిలుస్తారు. దుష్యంత్ రావు త‌న డ‌బ్బు, ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి కేసుని నీరుగార్చాల‌ని చూస్తాడు. అయితే ర‌ఘు ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా సాక్ష్యాల‌ను తీసుకొచ్చి కేసుని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే స‌మ‌యంలో చ‌ట‌ర్జీ ఎంట్రీతో అంతా తారు మార‌వుతుంది. చివ‌ర‌కు అహింస‌ను న‌మ్మే ర‌ఘు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు? ర‌ఘు, అహ‌ల్య‌ల‌కు న్యాయం జ‌రుగుతుందా? చివరకు  దుష్యంత్ రావు ఏమౌతాడు? అనే మిగతా కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

ఇక నటీనటుల విష‌యానికి వ‌స్తే ద‌గ్గుబాటి అభిరాం హీరోగా ఇది తొలి సినిమా కాబట్టి, నటనలో పరిణితి లోపించినా అక్కడక్కడా మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. అతని పెర్ఫార్మన్స్ తగట్టుగా స‌న్నివేశాల‌ను తేజ ప్లానింగ్‌తో చేయ‌టం అభిరాంకు క‌లిసొచ్చింది. ఇక గీతికా తివారి ఎక్స్‌ప్రెసివ్ ఆర్టిస్ట్‌. త‌న‌కు అదృష్టం కలిసొచ్చి పెర్ఫామెన్స్ రోల్స్ ప‌డితే మంచి న‌టిగా పేరు వ‌స్తుంది. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌మ‌ల్ కామ‌రాజు, లాయ‌ర్ పాత్రలో స‌దా, స్పెష‌ల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్ రోల్‌లో ర‌వి కాలే.. అంద‌రూ వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. విల‌న్‌గా న‌టించిన ర‌జ‌త్ బేడి, చ‌ట‌ర్జీ పాత్ర‌లో న‌టించిన మ‌రో యాక్ట‌ర్‌,  గ్యాంగ్‌గా క‌నిపించిన వారంద‌రూ ఆడియెన్స్‌కి క‌నెక్ట్ కారు.

సాంకేతిక వర్గం పనితీరు:

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, మరో సారి తాను తీసిన సన్నివేశాలు ఈ చిత్రంలో కనపడటం తో ప్రేక్షకుడిని నిరుత్సహపరిచింది. సినిమా చూస్తున్నంత సేపు అతను గత సినిమాల్లో సన్నివేశాలే గురుతుకువస్తాయి. 'నేను రాజు నేనే మంత్రి' చిత్రంతో హిట్ కొట్టిన తేజ‌.. 'సీత' చిత్రంతో నిరుత్సాహ ప‌రిచారు. పోనీ అహింస మూవీతో మ‌రో స‌క్సెస్ అందుకుంటారేమోన‌ని భావిస్తే.. ఇది కూడా ఇది కూడా  నిరుత్సాహ‌పరిచింది. ఇక చాలా సంవత్స‌రాల త‌ర్వాత తేజ‌, అర్పీ ప‌ట్నాయ‌క్ కాంబినేష‌న్‌లో అహింస సినిమా వ‌చ్చింది. ‘ఉందిలే..’ పాట మినహా మరే పాట బాగోలేదు. నేపథ్య సంగీతం ఓకే. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది.  కృష్ణతత్వానికి సంబందించిన కొన్ని సంభాషణలు ఆకట్టుకుంటాయి. సినిమాను కాస్త ట్రిమ్ చేసుంటే బావుండేద‌నిపించింది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

ఒక బలహీనుడు ఒక బలవంతుడి పై చేసే పోరాటమే ఈ కథలోని మెయిన్ పాయింట్. హీరో, విలన్ ల పాత్రలపరంగా చూసుకుంటే ఈ చిత్రం జయం సీక్వల్ గా అనిపిస్తుంది. ఈ చిత్రం టైటిల్ అహింస అయినా చేజింగ్స్, యాక్షన్ సిఖ్వెన్సు లతో హింసాత్మకంగా కనిపిస్తాయి. ప్రథమార్ధం లో హీరో హీరోయిన్ల ప్రేమ బంధం అద్భుతంగా చూపించాడు. ఆ తరవాత కథలోని ట్విస్టులు సంఘర్షణలు అంతగా మెప్పించలేక పోయాయి. ఇక సినిమాలో మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు ఐటెమ్ సాంగ్ పెట్టటం.. అది కూడా విల‌న్ ఇంట్లో కొడుకుల శ‌వాల‌ను పెట్టుకుని... అదేం లాజిక్కో మ‌రి డైరెక్ట‌ర్‌కే తెలియాలి. లాజిక్కులు పక్కన పెట్టి సినిమా చూస్తే పరవాలేదు అనిపిస్తుంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :