ASBL NSL Infratech

రివ్యూ : న్యూ ఏజ్ రామాయణం ‘ఆదిపురుష్’ 3D

రివ్యూ : న్యూ ఏజ్ రామాయణం ‘ఆదిపురుష్’ 3D

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు: టి సిరీస్, రెట్రోఫీల్స్,  
నటీనటులు : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహన్, దేవదత్ నాగ్, వస్తల్ సేథ్,తృప్తి తోరాద్మ,  
సినిమాటోగ్రఫీ : కార్తీక్ పళని, ఎడిటర్: అపూర్వ మోతివాలే సహాయ్, ఆశిష్ మ్హత్రే,
సంగీతం : అజయ్ – అతుల్, నేపధ్య సంగీతం : సంచిత్ బల్హార - అంకిత్ బల్హార,
కథా మూలం : వాల్మీకి రామాయణం,
రిలీజ్డ్ బై : ఏ ఏ ఫిలిమ్స్, యూ వి క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కె ఆర్ జి స్టూడియోస్,  
నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్,  
స్క్రీన్ ప్లే, దర్శకత్వం  : ఓం రౌత్
విడుదల తేదీ: 16.06.2023

భార‌తీయులు ఎంతో గొప్ప‌గా భావించే ఇతిహాసం రామాయ‌ణం. దాని ఆధారంగా ఎన్నో సినిమాలు వ‌చ్చాయి.  శ్రీరామ చంద్రుడిగా ప్రభాస్, జానకీ దేవిగా కృతి స‌న‌న్, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్, హనుమంతుడిగా దేవదత్ నాగ్ నటించిన ‘ఆదిపురుష్’ ఈ రోజు  జూన్ 16న రిలీజైంది. పౌరాణిక చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా నటించిన ఈ చిత్రం షుమారు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ పై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొంది. పోస్టర్లు, టీజర్, ట్రైలర్లలో రాముడి రూపంలో ప్రభాస్‌ను చూసి ఊహించినట్టుగానే భలే ఉన్నాడే అన్నారు. ఈరోజు మూడు గంటలపాటు వెండితెరపై ప్రేక్షకులకు  కాస్త కనువిందు చేయడానికి న్యూ ఏజ్ రాముడు వచ్చేశాడు. మరి, ఈ రాజా రాముడి కథ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించాడా? రివ్యూ లో చూద్దాం..

కథ :

రామాయణ ఇతివృత్తం జనాలకి తెలియనది కాదు. అయితే ఇక్కడ రామాయణంలో ఉన్న పేర్లు పెట్టకుండా రాఘవ (రాముడు), జానకి (సీత), శేషు(లక్ష్మణుడు), లంకేశ్ (రావణాసురుడు)  భజరంగ్ (ఆంజనేయుడు).. ఇలా పర్యాయపదాలను వాడారు. రాఘవుడు శివధనుస్సును విరిచి జానకిని పరిణయమాడడం దగ్గర నుంచి వనవాసానికి వెళ్లేంత వరకు పెయింటింగ్ విజువల్స్‌తో క్లుప్తంగా ఉంటుంది. కైకేయికి దశరథుడు ఇచ్చిన మాట వల్ల ఆమె కోరిక మేరకు రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తాడు. రాముడితో పాటు సీత, వారికి తోడుగా లక్ష్మణుడు వెళ్తారు. వీరు వనవాసంలో ఉండగా ఒకనాడు రాముడిని చూసిన రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ ఆయన సౌందర్యానికి ముగ్దురాలు అయిపోతుంది. ఆయనే కావాలని కోరుకుంటుంది. కానీ, తాను వివాహితుడినని.. తన భార్య సీత అని రాముడు చెప్తాడు. దీంతో సీతపై దాడి చేసే ప్రయత్నం చేస్తుంది శూర్పణఖ. ఆమెకు బుద్ధి చెప్పడానికి లక్ష్మణుడు ముక్కు కోసేస్తాడు.  శూర్పణఖ ఏడుస్తూ అన్న లంకేశ్వరుడి దగ్గరకు వెళ్తుంది. శ్రీరాముడి దగ్గర  విశ్వ సౌందర్యవతి అయిన జానకి ఉందని.. ఆమెను అపహరించుకు వచ్చి పెళ్లాడమని కోరుతుంది. చెల్లెలి కోరిక మేరకు రావణుడు వెళ్లి సీతను ఎత్తుకొచ్చేస్తాడు. సీత కోసం వానర సైన్యంతో కలిసి రాముడు యుద్ధం చేస్తాడు. రావణుడిని వధించి సీతను కాపాడి లోక కళ్యాణం చేస్తాడు శ్రీరాముడు. ఇదీ క్లుప్తంగా రామాయణం.

నటీనటుల హావభావాలు:

ప్రభాస్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. రాఘవుడిగా ప్రభాస్ ఆహార్యం, అందం కట్టిపడేస్తాయి. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యుద్ద సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఇక కథానాయికగా నటించిన కృతి సనన్ జానకిగా అందంగా ఉన్నారు.  తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ కృతి సనన్ పలికించిన హావభావాలు అలరించాయి.  లంకేశ్ గా సైఫ్ అలీ ఖాన్ గెటప్ ఇబ్బంది పెట్టినా.. నటన బాగుంది. అలాగే శేషుగా సన్నీ సింగ్, మండోదరిగా సోనాల్ చౌహన్, భజరంగ్ గా దేవదత్ నాగ్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

పూర్తిగా వీఎఫ్ఎక్స్ ఆధారంగా ఈ ఫైట్ సీక్వెన్స్ సాగింది. అయితే, ఈ వీఎఫ్ఎక్స్ అంత అద్భుతంగా ఏమీ లేవు. కానీ, 3డీలో చూడటానికి అయితే బాగున్నాయి. 3డీలో ఆ విజువల్స్ చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తాయి. ఫస్టాఫ్‌కే ఈ పోరాట సన్నివేశం హైలైట్ అని చెప్పాలి. వీఎఫ్ఎక్స్ క్వాలిటీ ఈ సన్నివేశంలో కనిపిస్తుంది. లంకలో గబ్బిలం లాంటి వింత జంతువుపై కూర్చొని ల్యాండ్ అయ్యే సీన్ కూడా కొత్తగా ఉంటుంది. ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చే సీన్. ఇలా విజువల్ ఎఫెక్ట్స్ చాలా వున్నాయి.  విషయానికి వస్తే.. ప్రధాన బలం సంగీతం. అజయ్-అతుల్ ద్వయం అందించిన పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు గురించే చెప్పుకోవాలి. ప్రతి సన్నివేశానికి తమ నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. దర్శకుడు ఓం రౌత్ 3డిలో భారీ విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినా.. మెయిన్ గా కథనంలో ఇంట్రెస్ట్ మిస్ అయింది. నిర్మాతల నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

విశ్లేషణ:

రావణాసురుడు హిమాలయాల్లో తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి వరం పొందినప్పటి నుంచి అసలు సినిమా మొదలైంది. ముఖ్యంగా రావణాసురుడి కాస్ట్యూమ్స్ చిత్రంగా అనిపిస్తాయి. మార్వెల్ సినిమాల్లోని సూపర్ హీరో కాస్ట్యూమ్‌లా ఉంది రావణుడి డ్రెస్. ఇక ఆయన ఆకారం కూడా కొత్తగానే ఉంది. టీజర్‌లో చూసినట్టుగానే గెడ్డం, మంచి హెయిర్‌స్టైల్‌తో మోడరన్‌గా ఉన్నాడు రావణుడు. ఇక ఆయన దశకంఠ అవతారాన్ని కూడా కొత్తగా చూపించారు. వనవాసంలో రాఘవుడి పాత్రను పరిచయం చేయడానికి ఒక యాక్షన్ సీక్వెన్స్‌తో కూడిన ఇంట్రడక్షన్ సీన్ పెట్టారు దర్శకుడు. రాఘవుడి మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్లు ఎవరు అనే విషయంతో సంబంధం లేకుండా ఆయన శక్తిని మాత్రం తెలియజెప్పే విధంగా ఉంది ఆ యాక్షన్ సీక్వెన్స్. పూర్తిగా వీఎఫ్ఎక్స్ ఆధారంగా ఈ ఫైట్ సీక్వెన్స్ సాగింది. అయితే, ఈ వీఎఫ్ఎక్స్ అంత అద్భుతంగా ఏమీ లేవు. కానీ, 3డీలో చూడటానికి అయితే బాగున్నాయి.  ఇక సినిమాకు ప్రధానమైన జానకిని రావణుడు అపహరించే సన్నివేశాన్ని దర్శకుడు చాలా కొత్తగా చూపించారు. పాత సినిమాల్లో రావణుడు తాను నిలబడ్డ చోటు నుంచే భూమిని పెకలించి సీతను తీసుకువెళ్తాడు. కానీ, ఈ సినిమాలో గబ్బిలం లాంటి ఒక పెద్ద జంతువుపై తీసుకెళ్తాడు. ఈ సన్నివేశం తెరపై చూడటానికి అద్భుతంగా ఉంది.

ముఖ్యంగా జటాయువుతో పోరాటం రక్తి కట్టించింది. 3డీలో ఆ విజువల్స్ చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తాయి. ఫస్టాఫ్‌లో ఈ పోరాట సన్నివేశం హైలైట్ అని చెప్పాలి. వీఎఫ్ఎక్స్ క్వాలిటీ ఈ సన్నివేశంలో కనిపిస్తుంది. లంకను కూడా చాలా కొత్తగా ఆవిష్కరించారు.పూర్తిగా బ్లాక్ థీమ్‌లో ఉంటుంది. రావణుడితో పాటు లంకలో ఉండే మనుషుల ఆకారాలు కూడా కొన్ని హాలీవుడ్ సినిమాలను గుర్తుచేస్తాయి. రావణుడి ఆకారం, నడక కూడా కొత్తగా ఉంటాయి. లంకలో ఉన్న తన కుటుంబ సభ్యులు, మనుషుల కన్నా రావణుడిని ఆకారాన్ని పెద్దగా చూపించారు దర్శకుడు. ఈ పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ నటన బాగుంది. హనుమంతుడు సముద్రాన్ని దాటడం, ఆయన్ని లంకలో ఇంద్రజిత్తుడు బంధించడం, తోకకు నిప్పు పెట్టడం, ఆంజనేయుడు లంకాదహణం చేయడం.. ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. సెకండాఫ్ మాత్రం ఇబ్బంది పెడుతుంది. కేవలం యుద్ధ సన్నివేశాలతో సెకండాఫ్‌ను నింపేశారు.

ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చే సీన్, నిజానికి కుంభకర్ణుడి ఆగమనం అద్భుతంగా ఉండాలి. ఆయన్ని నిద్రలేపడం, యుద్ధభూమిలోకి వచ్చిన తరవాత ఆయన చేసే హడావుడి ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలి. కానీ, ఇక్కడ అదేమీ లేదు. చాలా సింపుల్‌గా లేచి వచ్చేస్తాడు కుంభకర్ణుడు. అంతే సింపుల్‌గా చంపేస్తాడు.  ఇక క్లైమాక్స్‌లో రావణుడిని రాఘవుడు వధించే సన్నివేశం వీఎఫ్ఎక్స్ మోతాదు ఎక్కువైందనే భావన కలుగుతుంది. రావణుడిని రాఘవుడు చంపేటప్పుడు ఆయనకు సాయపడే అంశాలను ఇందులో చూపించలేదు. సినిమా ప్రారంభంలో రావణాసురుడు హిమాలయాల్లో తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి వరం పొందుతాడు. 'అది హిరణ్యకసుపుడికి ఇచ్చిన వరంలా ఉంటుంది. నీ మరణం భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, ఇంట్లోకాని, బయట కానీ, దేవతలతోకాని, దానవుడితో కానీ, ఉండదు అని వరం ఇస్తాడు.  కానీ నాభి వద్దే రాముడు ఎందుకు బాణాన్ని సంధించాడు అనేదానికి వివరణ లేదు. రావణాసురుడి నాభి వద్ద అమృత బాండం ఉంటుందని విభీషనుడు చెప్పే సన్నివేశమ్ లేదు. ఈ సినిమాను 3డీలో చూస్తేనే ఎంజాయ్ చేయగలుగుతారు. 2డీలో అయితే విసుగు పుట్టడం ఖాయం. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రభాస్ ఫాన్స్ ను, ఫ్యామిలీ మెంబెర్స్ ను చాలా బాగా ఆకట్టుకుంటుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :