ASBL NSL Infratech

'అలిషా' ఫస్ట్‌ లుక్‌ విడుదల

'అలిషా' ఫస్ట్‌ లుక్‌ విడుదల

ఆర్పీ పట్నాయక్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం అలిషా. ఐశ్వర్య సాల్వి, వేదాంత్‌ సలూజా, రిచా కల్రా, అక్షయ్‌ బక్చు కీలక పాత్రధారులు. సోనాల్‌ నిర్మాత. కొత్త ఏడాది ఆరంభం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. పూర్తి సినిమాని విదేశాల్లోనే తెరకెక్కిస్తారు. డాల్బీ ఆట్మాస్‌ సౌండ్‌ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న చిత్రమిది. స్టార్‌ కథానాయకులు నటించిన చాలా సినిమాలు డాల్బీ ఎట్మాస్‌ సౌండ్‌ తోనే విడుదలైనా.. ఆ సాంకేతికత కోసమే తయారు చేసిన కథలు ఇప్పటిదాకా మన దేశంలో రాలేదు. అలిషా ఎవరు? ఆమె కథేమిటన్నది తెరపైనే చూడాలని తెలిపాయి చిత్రవర్గాలు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :