ASBL NSL Infratech

ఎఫ్‌ఏవోలో భారత ప్రతినిధిగా రాజేందర్‌ నియామకం

ఎఫ్‌ఏవోలో భారత ప్రతినిధిగా రాజేందర్‌ నియామకం

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఐఏఎస్‌ అధికారి బి.రాజేందర్‌కు అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలో ఆకలి నిర్మూలనకు పనిచేస్తున్న ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో)లో భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఆయనను నియమించారు. జనవరి రెండో వారంలో ఆయన రోమ్‌ నగరంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతర్జాతీయ వ్వవసాయాభివృద్ధి నిధి (ఐఎఫ్‌ఏడీ), ప్రపంచ ఆహార సంస్థ (డబ్ల్యూఎఫ్‌వో)ల్లోనూ ప్రతినిధిగానూ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం కేంద్ర వ్వవసాయ, సహకార-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బిహార్‌ కేడర్‌కు చెందిన రాజేందర్‌ ఆదిలాబాద్‌ జిల్లా కౌటా గ్రామంలో జన్మించారు. వ్వవసాయ విభాగంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఆయన, ఢిల్లీలోని భారత వ్వవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ)లో పీహెచ్‌డీ చేశారు. 1995లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. పట్నాతో ఆరు జిల్లాలకు సుమారు తొమ్మిదేళ్లు కలెక్టర్‌గా పనిచేశారు. వివిధ శాఖల్లో అనేక హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :