ASBL NSL Infratech

జనవరి 3న 'కళాకారుడు' విడుదల

జనవరి 3న 'కళాకారుడు' విడుదల

డబ్బున్న అమ్మయిని పెళ్లిచేసుకొని కోటీశ్వరుడు కావాలని కలలుకన్న ఓ అబ్బాయి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం అని అన్నారు శ్రీధర్‌ శ్రీమంతుల. ఆయన కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం కళాకారుడు. కిరణ్‌ దుస్సా దర్శకుడు. ఈ నెల 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీధర్‌ శ్రీమంతుల మాట్లాడుతూ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. వినోదం, సెంటిమెంట్‌, యాక్షన్‌తో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం మిళితమై ఉంటుంది. హైదరాబాద్‌, భీమవరం, పాలకొల్లు, గోవాలో సినిమాలను చిత్రీకరించాం. నాలుగు ఫైట్స్‌, ఆరు పాటలుంటాయి. ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తున్నది. అశ్లీలతకు తావులేని మంచి కుటుంబ కథా చిత్రంగా అందరిని అలరిస్తుంది అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :