ASBL NSL Infratech

కుంభమేళ ఉత్సవంలో పాల్గొనాలని చంద్రబాబు కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం

కుంభమేళ ఉత్సవంలో పాల్గొనాలని చంద్రబాబు కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం

ఉత్తరప్రదేశ్ లో జనవరి 15 నుంచి ప్రయాగలో జరిగే కుంభమేళ ఉత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. యూపీ సీఎం యోగీ ఆధిత్యనాధ్ తరఫున ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సతీష్ మహనా ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి ఆహ్వానం అందజేశారు. వారణాసిలో జనవరి 21 నుంచి మూడురోజులపాటు జరిగే ప్రవాస భారతి దినోత్సవానికి కూడా హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందించారు.

ఈ సందర్భంగా యూపీ మంత్రి సతీష్ మహనా మాట్లాడుతూ అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాల అమలులో "మీరే నాకు స్పూర్తి" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశంసలతో ముంచెత్తారు. "ప్రజలకు సేవ చేయాలన్న తపనతో నిరంతరం విశ్రమించని నేత మీరని" అభినందించారు. పాలన ద్వారా అనునిత్యం ప్రజలకు మంచి చేయడానికి మీరు పడుతున్న తపన ఆదర్శనీయమన్నారు."ఆనాడు మీరు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధిని స్పూర్తిగా తీసుకుని తాను గతంలో యూపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమలు చేశానని గుర్తు చేసుకున్నారు. " మీహయాంలో రాష్ట్రాభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో సాధిస్తున్న విధానంతో మిమ్మలను సీఈవొ అని ముద్దుగా పిలుచుకునే వారమని స్మరించుకున్నారు. ఈ సమావేశంలో సీఎం కార్యదర్శులు రాజమౌళి, సాయి ప్రసాద్ లు పాల్గొన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :