ASBL NSL Infratech

హాలీవుడ్ లో సినీ సునామీ సృష్టిస్తున్న తెలుగు దర్శక-రచయిత, జగదీష్ దానేటి

హాలీవుడ్ లో సినీ సునామీ సృష్టిస్తున్న తెలుగు దర్శక-రచయిత, జగదీష్ దానేటి

సినిమాని ప్రేమించే ప్రతి సినీ శ్రామికుడికీ హాలీవుడ్ లో అడుగుపెట్టాలనేది ఒక కల. ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నందువలన హాలీవుడ్ లో సినిమా చేయటం చాలా మందికి కలగా మిగిలిపోయింది. అందరూ అందని ద్రాక్షగా అభివర్ణిస్తున్న హాలీవుడ్ అవకాశాన్ని, తన సంకల్పంతో, సృజనాత్మకతతో, భారతీయ సినీ దర్శక రచయిత, జగదీష్ దానేటి సొంతం చేసుకున్నారు. వందల మిలియన్ల పెట్టుబడితో  చిత్రాలు నిర్మిస్తున్నా, కథాబలం లేకపోవటం వల్ల హాలీవుడ్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో, జగదీష్ దానేటి తన కథలు, స్క్రీన్-ప్లే తో  హాలీవుడ్ నటులను, నిర్మాతలను  కట్టిపడేసి, తన హాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధం చేసుకున్నారు. హాలీవుడ్ లో "జె.డి." గాపిలవబడుతున్న ఈ దర్శకరచయిత, మన తెలుగువాడవ్వాటం విశేషం. తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా పనిచేస్తూ, దర్శకుడిగా మారిన జగదీష్ దానేటి,24 విభాగాలపై తనకున్న పట్టుతో అంతర్జాతీయ చిత్రాలకు 'క్రియేటివ్ కన్సల్టింగ్' చేయటంలో విశేష నైపుణ్యం సాధించారు.

విభిన్న కథాoశాలతో కమర్షియల్ చిత్రాలను నిర్మిస్తూ వస్తున్న హాలీవుడ్ ప్రఖ్యాత ప్రొడక్షన్ కంపెనీ,'మార్టిని ఫిలిమ్స్' వంటి అమెరికన్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీలతో జగదీష్ దానేటి కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రపంచ సినిమాలో సరికొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాయి.

లాస్ ఏంజిల్స్ లో ఇటీవల జరిగిన ఒక ఫిలిం ఈవెంట్ లో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు-నిర్మాత, 'జానీ మార్టిన్' మన తెలుగు దర్శకుడిని హాలీవుడ్ కి స్వాగతం పలుకుతూ, జగదీష్ దానేటి దర్శకత్వం వహించబోతున్న హాలీవుడ్ చిత్రాలకు తాను నిర్మాణ భాగస్వామ్యం పంచుకోబోతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.జానీ మార్టిన్ హాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ అవార్డు చిత్రాలకు నిర్మాత మరియు దర్శకుడిగా వ్యవహరించారు. కీను రీవ్స్ ( ది మేట్రిక్ ), హ్యూగో వీవింగ్ మరియు నటాలి పోర్ట్ మాన్ ( వి ఫర్ వెందెత) వంటి హాలీవుడ్ నటులకు మరియు టైటానిక్ వంటి అద్భుత చిత్రాలకు స్టంట్ డైరెక్టర్ గా పూర్వాశ్రమంలో పని చేశారు. అల్పచినో ( ది హ్యాంగ్ మాన్), నీకోలస్ కేజ్ ( వెంజెన్స్ ఎ లవ్ స్టోరీ ), స్లాటర్ గూడింగ్ జూనియర్ ( హిట్ లిస్ట్ అండ్ లైస్ అండ్ ఇల్ల్యుజన్స్ ), జాన్ ట్రవోల్టా ( ఐ యామ్ వ్రాత్ ) వంటి సూపర్ స్టార్స్ తో చిత్రాలు నిర్మించిన జానీ మార్టిన్ వంటి హాలీవుడ్ దిగ్గజo, జగదీష్ రాసిన కథలకు, స్క్రీన్- ప్లే కి మంత్ర ముగ్దుడై, 2020 ప్రథమార్ధం నుండి ఈ కథలను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.

1.37 బిలియన్ల జనాభాతో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం, సినీ రంగానికి ఎంతో ఆర్ధిక పరిపుష్టిని, లాభాలను  ఆర్జించిపెట్టింది. జన్మతః భారతీయుడైన జగదీష్ దానేటి, ప్రపంచ సినిమా, టెక్నాలజీ మరియు మారుతున్న హాలీవుడ్  ధోరణుల గురించి విశేష పరిశోధన చేశారు. విభిన్న సంస్కృతులకు చెందిన ప్రేక్షకుల ఆసక్తికి అద్దం పట్టే ఎన్నో  అద్భుతమైన కథలు సిద్ధం చేసుకున్న ఈ యువ దర్శకుడు, అమెరికాకు చెందిన ప్రము ఖ స్టూడియోలుప్రొడక్షన్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. అమెరికా, ఇండియా మరియు ఇతర దేశాలలో షూటింగ్ జరుపుకోనున్న ఈ ఇండో అమెరికన్ ప్రాజెక్టుల ద్వారా పెట్టుబడులు, నిర్మాతలు, పంపిణీదారులు, సాంకేతిక నిపుణులు, ముఖ్యంగా నటులకు పెద్ద  స్థాయిలో హాలీవుడ్ తలుపులు తెరుచుకోనున్నాయి.

నిజమైన సినిమా ఔత్సాహికులకు, నైపుణ్యం ఉన్న టెక్నిషియన్లు మరియు నటులకు ఎటువంటి వివక్ష లేకుండా తన చిత్రాలలో అవకాశం ఇవ్వటం ద్వారా, సినిమా పరంగా ఉన్న భౌగోళిక హద్దులు చెరిపివేయనున్నట్టు 40వ అమెరికన్ ఫిల్మ్ మార్కెట్ లో జగదీష్  తెలిపారు. రష్యా, చైనా, హాoకాంగ్, అమెరికాకు చెందిన హవాయి మరియు పలు రాష్ట్రాల ఫిల్మ్ కమిషన్స్ తో సంయుక్తంగా చిత్రాలు నిర్మించే దిశగా చర్చలు జరిగాయి. ఫలితంగా భారత్ మరియు భాగస్వామ్య  దేశాల చలన చిత్ర మరియు అనుబంధ పరిశ్రమలలో ఉత్పాదకతలో వృధ్ధి ఆశించవచ్చు. ముఖ్యంగా పారామౌంట్ పిక్చర్స్ కు చెందిన ఫ్యూచరిస్ట్, శ్రీ టెడ్ షిలోవిట్స్ తో సంప్రదించి, భారతదేశంలో ఆగ్మెంటేడ్ రియాలిటీ / వర్ట్యువల్ రియాలిటీ (AR/VR) లాబ్స్ ఏర్పాటు విషయమై జగదీష్ సుముఖత సాధించారు.

అమెరికన్ ఫిల్మ్ మార్కెట్లాస్ ఏంజిల్స్ లో, ఖరారైన విభిన్న ప్రోజెక్టుల నేపథ్యంలో జరిగిన చర్చలలో, భారతీయ సినిమాకి చెందిన ప్రముఖ నటులను ఈ ఇండోఅమెరికన్ చిత్రాలలో, హాలీవుడ్ స్టార్స్ తో కలిసి నటింపచేసేలా జగదీష్ దానేటి చేసిన ప్రపోసల్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ఇటీవలే ఇండియా చేరుకున్న జగదీష్ మరియు ఒప్పందాలు కుదుర్చుకున్న అమెరికన్ ఫిలిం కంపెనీలు, హాలీవుడ్ మరియు ప్రపంచ సినిమాలో ప్రతిష్టాత్మకంగా అడుగుపెట్టబోయే భారత నటీనటులు మరియు టెక్నీషియన్ల వివరాలు, వారిని సంప్రదించిన అనంతరం వెల్లడించాల్సి ఉంది.

టెక్నాలజీ పరంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లని రాబట్టడంలో ఎప్పుడూ ముందుండే హాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తూ, అమెరికా-సౌత్ ఈస్ట్ ఆసియాల మధ్య క్రియేటివ్ కారిడార్ వేయనున్న దక్షిణ భారత రచయిత దర్శకుడు, జగదీష్ దానేటి తన ప్రహసనంలో అద్భుతమైన విజయాలను సాధించాలని కోరుకుందాం.

Click here for Photogallery

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :