ASBL NSL Infratech

ట్రిపుల్ తలాక్ పై మమతా బెనర్జీతో మాట్లాడాను: ముఖ్యమంత్రి చంద్రబాబు

ట్రిపుల్ తలాక్ పై మమతా బెనర్జీతో మాట్లాడాను: ముఖ్యమంత్రి చంద్రబాబు

* ట్రిపుల్ తలాక్ పై మమతా బెనర్జీతో మాట్లాడాను: ముఖ్యమంత్రి చంద్రబాబు *రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్
ట్రిపుల్ తలాక్ పై టిడిపి ఎంపిలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ బాధ్యులు
ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
దీనిపై ఆదివారం రాత్రే మమతా బెనర్జీతో మాట్లాడాను: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈ రోజు ఉదయం రాహుల్ గాంధీతో కూడా మాట్లాడాను. 
ముస్లింలపై వేధింపులను అడ్డుకోవాలని కోరాను. అందుకు వారంతా సంఘీభావంగా ఉన్నారు.
రాజ్యసభలో ప్రతిపక్షాలన్నీ ఏకోన్ముఖంగా పోరాడాలి. బిజెపి ముస్లిం వ్యతిరేక పోకడలను అడ్డుకోవాలి.
సభలో అన్ని పార్టీలను సమన్వయం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా పోరాడాలి. ప్రతిపక్షాలన్నీ ఏకోన్ముఖం కావాలి.
ట్రిపుల్ తలాక్ చట్టాన్ని బలవంతంగా రుద్దడం లౌకిక వాదానికే ముప్పు. 
దేశ భద్రతకు, దేశ సమగ్రతకే ప్రమాదం
దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలి. ఒక్కో వర్గానికి ఒక్కో చట్టం ఉండకూడదు. అదే సమయంలో అల్పసంఖ్యాక వర్గాల హక్కులను కాపాడాలి.
ముస్లింలను వేధింపులకు గురిచేయరాదు. అల్ప సంఖ్యాక వర్గాలపై ఇప్పటికే దాడులు పెరిగాయి.
ముస్లింలలో అభదత్ర దేశ సమగ్రతకే మంచిది కాదు. దేశ భవిష్యత్తును దెబ్బతీసేలా కేంద్రం చర్యలు ఉండరాదు.
ఏ మాత్రం పొరబాటు చేసినా దేశం మొత్తం నష్టపోతుంది. 
భారత లౌకిక వాదం గొప్పదనం నిలబెట్టాలి. 
నాన్ బిజెపి పార్టీలన్నీ సంఘటితం కావాలి. ముస్లిం మైనారిటీల హక్కులను కాపాడాలి.
ముస్లింల హక్కుల కోసం టిడిపి ఎంపిలు పార్లమెంటులో పోరాడాలి. తెలుగుదేశం గొంతును బలంగా వినిపించాలి.

రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్. ట్రిపుల్ తలాక్ అంశంపై చర్చ. ముస్లింలపై వేధింపులను అడ్డుకోవాలన్న చంద్రబాబు. మమతా బెనెర్జికి సియం చంద్రబాబు ఫోన్. ముస్లింల హక్కులను కాపాడాలన్న చంద్రబాబు. బిజెపి ముస్లిం వ్యతిరేక చర్యలను ప్రతిఘటించాలని కోరిన చంద్రబాబు. ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగా నాన్ బిజెపి వర్గాలన్నీ ఏకం కావాలన్న చంద్రబాబు.

 
praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :