ASBL Koncept Ambience

పత్తికొండ బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగం...

పత్తికొండ బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగం...

వేలాది మంది ఇక్కడకు వచ్చి ప్రజాసంకల్పయాత్రకు మద్దతు తెలుపుతున్నారని అందరికీ ధన్యవాదాలు తెలిపిన శ్రీ వైయస్ జగన్. వాళ వేల మంది నాతోపాటు అడుగులు వేశారు. వేల మంది రోడ్డుపై నిలబడాల్సిన అవసరం లేకపోయినా, ఎండను ఖాతరు చేయకుండా నడిచారని శ్రీ జగన్ అన్నారు. చెరగని చిరునవ్వుతో ఆప్యాయతను, ఆత్మీయతను చూపించారన్నారు. ప్రతి అవ్వకు, తాతకు, సోదరుడికి, అక్కకు, చెల్లెకు ప్రేమానురాగాలను చూపించిన ప్రతి ఒక్కరికీ కృత‌జ్ఞతలు తెలిపారు. నాలుగేళ్ల బాబు పాలన చూశాక.. ఇన్ని మోసాలు, అబద్ధాలు ఆడే ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదని శ్రీ జగన్ తెలిపారు. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే.. చంద్రబాబు పాలనలో వైఫల్యాలు అన్నీఇన్నీ కావని శ్రీ జగన్ ప్రజలకు గుర్తు చేశారు. బాబు పాలన చూశాక మనకు ఎలాంటి నాయకత్వం కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. మోసం చేసేవారు, అబద్ధాలు చెప్పేవారు నాయకుడిగా కావాలా అని శ్రీ జగన్ ప్రజల్ని ప్రశ్నించారు. 

ఈ రాష్ట్రంలో చట్టం లేదు. న్యాయం లేదు. పశువులు కొంటున్నట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని శ్రీ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయరు. వారిపై వేటు వేయరని శ్రీ జగన్ మండిపడ్డారు. ఈ రోజు చట్టసభలు దొంగలసభగా చేశారని శ్రీ జగన్ అన్నారు. పట్టపగలు చంద్రబాబు తను సంపాదించిన అవినీతి సొమ్ములో నుంచి రూ.20-30 కోట్లతో కొనుగోలు చేస్తుంటే అడిగే నాధుడు లేని పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్లిపోతోందన్నారు. ఇదే చంద్రబాబు ఓ ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ వీడియో-ఆడియో టేపుల్లో దొరికిపోతే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేయరు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరు. పదవి నుంచి తప్పుకోరు. జైలుకు కూడా పోరని.. ఇలాంటి పరిస్థితిలోకి రాజ్యాంగం వెళ్లిపోయిందన్నారు. గ్రామంలో పింఛన్లు, మరుగుదొడ్లు, ఇసుక నుంచి ప్రతి ఒక్కదానిపై అవినీతి మయం అయిందన్నారు. ఇక్కడకు వచ్చేముందు.. చదువుకుంటున్న విద్యార్థులు వచ్చారన్నారు. ఒక్కసారి జడ్పీ స్కూల్ చూసి రండని శ్రీ జగన్ హితవు పలికారు. మాట్లాడితే స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటారని శ్రీ జగన్ ఎద్దేవా చేశారు. మోడల్ స్కూల్స్ అంటారు. 6 నెలల నుంచి టీచర్లకు మోడల్ స్కూల్స్ లో జీతాలు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. కారణం.. నారాయణ సంస్థకు చంద్రబాబు బినామీయే కారణమన్నారు. నారాయణ స్కూల్స్ లో ఫీజులు వసూలు చేయెచ్చని దిక్కుమాలిన ఆలోచనలు చంద్రబాబు చేస్తున్నారని శ్రీ జగన్ తెలిపారు.

బాబుకు హెరిటేజ్ పుడ్ అనే సంస్థ ఉందన్నారు. అక్కడ దొరికే ప్రతి వస్తువూ రైతుల నుంచి తీసుకునేవే అన్నారు. తన హెరిటేజ్ సంస్థ కోసం చంద్రబాబు దళారీ అయి.. రైతుల్ని అమ్మేసే పరిస్థితి వచ్చిందన్నారు. పత్తిపంటకు రేటు ఉందా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. వేరుశెనగ రేటు క్వింటాలుకు రూ.2,000-2,500 ఉందన్నారు. కంది రేటు రూ.3000 ఉందన్నారు. ఈ రోజు కంది, పత్తి, మినుము.. ఇలా ఏపంటను తీసుకున్నా గిట్టుబాటు ధర లేదన్నారు. రైతు దగ్గర ఉన్నప్పుడు రేట్లు ఉండవన్నారు. చంద్రబాబు దళారీ వ్యవస్థను నడుపుతున్నారని శ్రీ జగన్ మండిపడ్డారు. రైతుల దగ్గర నుంచి దళారీల వద్దకు వెళ్తే రేట్లు మండిపోతున్నాయన్నారు. టమోటాలు .. రైతుల దగ్గర నుంచి దళారీలు కొంటే.. మండిపోతున్నాయన్నారు. నాలుగేళ్ల బాబు పాలన మీరంతా చూశారన్నారు. ముఖ్యమంత్రి కాకమునుపు.. కరెంటు ఛార్జీలు చంద్రబాబు తగ్గిస్తామని అన్న సంగతి ఈ సందర్భంగా శ్రీ జగన్ గుర్తు చేశారు. ఈ రోజు కరెంటు బిల్లు రూ.500, రూ.1000 వస్తోందన్నారు. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయన్నారు. రేట్లు విపరీతంగా పెంచటమే కాకుండా స్వ్కాడ్స్ ఇంటికి పంపి.. రూ.20వేలు కరెంటు బిల్లు కట్టండని పెనాల్టీ వేసి పోతున్నారన్నారు. నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన కన్నా ముందు.. మీరు బియ్యం కోసం రేషన్ షాపుకు వెళ్తే 9 రకాల వస్తువులు ఇచ్చేవారన్నారు.

బాబు వచ్చాక బియ్యం తప్ప రేషన్ షాపుల్లో ఏవీ ఇవ్వటం లేదన్నారు. బియ్యం కూడా వేలిముద్రలు పడటం లేదని ఎగరగొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. నాలుగు సంవత్సరాల ముందర చంద్రబాబు వచ్చి ప్రతి పేదవాడికీ మూడు సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికీ ఇళ్లు కట్టిస్తానని అన్న సంగతిని ఈ సందర్భంగా శ్రీ జగన్ ప్రజల్ని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాను... ఒక్క ఇల్లైన చంద్రబాబు కట్టించారా అని శ్రీ జగన్ ప్రశ్నిస్తే.. లేదని ప్రజలు చేతులు ఊపారు. జాబు రావాలంటే.. బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రెండువేల నిరుద్యోగ భ)తి ఇస్తామన్నారు. 45 నెలలు బాబు పరిపాలన చేశారు. ఇంటింటికీ రెండు వేలు చొప్పన లెక్కేస్తే ప్రతి ఇంటికీ 90వేలు బాబు బాకీ పడ్డారన్నారు. నాలుగేళ్ల క్రితం బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. వ్యవసాయ రుణాలన్నీ బేషరుతుగా మాఫీ కావాలంటే బాబు రావాలన్నారు. నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా.. బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చిందా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. బంగారం రాలేదు కానీ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయన్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా పొదుపుసంఘల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా అని శ్రీ జగన్ ప్రశ్నిస్తే లేదని సమాధానం వచ్చింది. ప్రత్యేక హోదా సంజీవని అన్న చంద్రబాబు అది తేకపోగా.. రాజకీయ వ్యవస్థలు దిగజార్చి ఇన్నిన్ని మోసాలు చెబుతున్నారని శ్రీ జగన్ అన్నారు. మీ మనస్సాక్షిని అడగండి. ఇలాంటి చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. చిన్నచిన్న అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరని.. పెద్దపెద్ద అబద్ధాలు చంద్రబాబు చెబుతారని శ్రీ జగన్ మండిపడ్డారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, ఓ కారు కొనిస్తానని బాబు అంటారని శ్రీ జగన్ హెచ్చరించారు. వ్యవస్థ మారాలి. చెప్పినది చేయకపోతే ఆ రాజకీయ నాయకుడు రాజీనామా చేసి వెళ్లాలి. ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అనేది వచ్చినప్పుడే అది సాధ్యమౌతుంది అని శ్రీ జగన్ స్పష్టం చేశారు. 

పత్తికొండ నియోజకవర్గంలో.. క్రిష్ణగిరి రిజర్వాయర్ కోసం వైయస్ఆర్ హయాంలోనే నిధులు కేటాయించి 85% పనులు పూర్తి చేశారు. మిగిలిపోయిన 15% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వాటినీ పూర్తి చేయని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ నియోజకవర్గంలో నీటి సమస్యలపై సెస్ ఇచ్చిన నివేదికలో అట్టడుగున ఉందని ఈ సందర్భంగా శ్రీ జగన్ తెలిపారు. ఇక్కడ టమోటాలు ఎక్కువగా పండిస్తారని గిట్టుబాటు ధర రాలేక రైతులు పంటను రోడ్ల మీద పారేస్తున్నారన్నారు. చంద్రబాబు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెడతానని హామీ ఇచ్చారని అదెక్కడ అని శ్రీ జగన్ ప్రశ్నించారు. రైతులు కోరుకున్నట్లు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ, మండలానికో కోల్డ్ స్టోరీజి ఏర్పాటు చేస్తామని శ్రీ జగన్ హామీ ఇచ్చారు. ఇక్కడ బీసీ హాస్టల్ పెట్టండని డిమాండ్ ఉంటే.. ఉన్నవాటిలో 6 మూసేశారన్నారు. ఎస్సీ, బీసీ హాస్టళ్లు ఈ నియోజకవర్గంలో మూసేశారన్నారు. 

క్లస్టర్ స్కూల్స్ అంటూ స్కూల్స్ మూసేస్తున్నారన్నారు. అన్నా.. 5 కి.మీ స్కూల్స్ కోసం వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారన్నారు. ఎక్కడ చూసిన స్కూల్స్ మూసేస్తున్నారు. టీచర్లకు జీతాలు ఇవ్వటం లేదని శ్రీ జగన్ తెలిపారు. రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యాన్ని తీసుకువచ్చేందుకు3వేల కి.మీ పాదయాత్ర చేపట్టామన్నారు. ఈ యాత్రలో మీ సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. నవరత్నాల్లో మెరుగు పరచటానికి సలహాలు, సూచనలు ఇవ్వమని శ్రీ జగన్ కోరారు. మన మేనిఫెస్టో కేవలం 2,3  పేజీలే ఉంటాయన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రతి కులాన్నీ ఎలా మోసం చేయాలో ఓ పేజీ ఉంటుందన్నారు. ఆ మేనిఫెస్టో కనపడితే ప్రజలు కొడతారని దాన్ని మాయం చేశారన్నారు. ఆ మేనిఫెస్టోలో ఉన్నవి చేస్తాం. లేనివి కూడా చేసి చూపిస్తామని శ్రీ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ చేసి చూపించి... ఇదిగో మా మేనిఫెస్టో మమ్మల్ని మళ్లీ ఆశీర్వదించండని కోరతామన్నారు. 

నవరత్నాల్లో అమ్మఒడి గురించి.. 

రేపు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అందరికీ మేలు చేస్తామన్నారు. బీసీల మీద ప్రేమ కేవలం దివంగత నేత వైయస్ఆర్ మాత్రమే చూపించారన్నారు. చంద్రబాబు మాత్రం బీసీలకు కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి విద్యార్థి ఏం చదువుతామంటే అది చదవిస్తామని వైయస్ఆర్ భరోసాగా ఉన్నారన్నారు. చదువు కోసం ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన పని లేదని ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తీసుకు వచ్చారని శ్రీ జగన్ తెలిపారు. ఇంజనీరింగ్ ఫీజులు చదవాలంటే లక్షకు పైనే ఫీజులు ఉన్నాయన్నారు. చంద్రబాబు పాలన వచ్చిందని .. ఇంజనీరింగ్ ఫీజులు చూస్తే.. లక్ష దాటుతున్నా.. బాబు కేవలం రూ.30, 35వేలే  ఇస్తున్నారని శ్రీ జగన్ తెలిపారు. ముష్టి వేస్తున్నట్లు చంద్రబాబు ఫీజులు ఇస్తున్నారన్నారు. మిగిలిన ఇంజనీరింగ్ చదువులు చదవాలంటే 70వేలు ఆ తల్లిదండ్రులు ఎక్కడ నుంచి తెస్తారని శ్రీ జగన్ ప్రశ్నించారు. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని.. ఆయన ఒక అడుగు వేస్తే.. నేను మరో రెండు అడుగులు ముందుకు వేస్తున్నానని.. మీ పిల్లలు ఏం చదువుతారో.. వారిని తను చదివిస్తానని శ్రీ జగన్ అన్నారు. విద్యార్థులు చదవటానికి దూర ప్రాంతాలు వెళ్లాల్సి వస్తుందని.. వారి మెస్ ఛార్జీలకు కూడా తనే ఇస్తానని.. తినటానికి 24వేలు ఇస్తామని శ్రీ జగన్ భరోసా ఇచ్చారు. చిన్నపిల్లలు స్కూల్స్ వెళ్లటం లేదని.. శ్రీ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బడులకు వెళ్తే 15వేలు ఇస్తామన్నారు. 

అవ్వాతాతలకు.. వయస్సు పెరిగే కొద్దీ మందులు కూడా కావాలి. కానీ అవ్వాతాతల గురించి పట్టించుకునే పరిస్థితిలేదన్నారు. గతంతో పోలిస్తే .. ప్రాజెక్టుల విషయంలో ఇప్పుడు అన్ని రేట్లు తగ్గింది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం రేట్లు పెంచుతారు. అదే అవ్వాతాతలకు పింఛను పెంచరని తెలిపారు. పింఛను రేపు రూ.2వేలు ఇస్తామన్నారు. అట్టడుగు, బలహీన వర్గాలకు పింఛను వయస్సు 45కే తగ్గిస్తామన్నారు. దీనివల్ల చాలా మందికి మేలు జరుగుతుందన్నారు. ప్రతిపేదవాడికీ ఇళ్లు కట్టిస్తానని శ్రీ జగన్ హామీ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా చేస్తామని శ్రీ జగన్ స్పష్టం చేశారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కూడా శ్రీ జగన్ హామీ ఇచ్చారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటికి అప్పులు ఎంత ఉంటాయో.. నాలుగు దఫాలుగా మీ చేతికే ఇస్తామన్నారు. ప్రతి అక్కాచెల్లెమ్మకు ఇది నామాట అని శ్రీజగన్ స్పష్టం చేశారు. ఈ హామీల్లో మార్పులు చేర్పులు ఉంటే చేస్తామన్నారు. 

పోలవరంపై.. 

కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ బాబుకు లేఖ రాశారు. ఈ లేఖ ఎలాగూ ప్రజలు చూడరు కదా.. అని ఉన్నది లేనట్లుగా చంద్రబాబు చెప్పారు. దీన్ని కొన్ని ఛానల్స్ మీడియా బాబుకు బజాయింపు చేశాయని శ్రీ జగన్ ఎద్దేవా చేశారు. ఈ లేఖలో టెండర్లును ప్రశ్నించారన్నారు. ఈ టెండర్లు పిలిచిన దాంట్లో మూడు వారాలు కూడా టైం ఇవ్వలేదు.. 45 రోజుల కన్నా తక్కువ టైం ఇస్తే రూల్స్ ఒప్పుకోవని లేఖ రాశారన్నారు. ఇచ్చిందే తక్కువ రోజులు. టెండర్లలో అందరూ పాల్గొనాలంటే.. ఈ ప్రొక్యూర్ మెంట్ సైట్ లో పోతే.. ఆ రోజుకి కూడా 22తేదీ నాటికి టెండర్ లేదని లేఖలో కేంద్రం తెలిపిందన్నారు. ఈ లేఖను చంద్రబాబు రకరకాలుగా మాయచేసి.. మాట్లాడారన్నారు.

పోలవరంలో తనకిష్టమైన వారిని సబ్ కాంట్రాక్టర్లుగా తీసుకువచ్చారన్నారు. 16వేల కోట్ల ప్రాజెక్టును రూ.54 వేల కోట్లుగా పెంచటంతో కేంద్ర ప్రభుత్వం కూడా భయపడుతోందన్నారు. ఇంతగా పోలవరంపై జరుగుతుంటే చంద్రబాబు తనకు అనుకూలమైన పేపర్లు, టీవీల్లో ఢాకా బజాయిస్తారన్నారు. ఇంత దారుణమైన వ్యవస్థలో మార్పు తీసుకురావటానికి మీరంతా కదిలి రావాలని, మీ బిడ్డను ఆశీర్వదించాలని శ్రీ జగన్ కోరారు. ఇక్కడ ప్రత్యేక పరిస్థితుల్లో హత్యలు చేసి.. వ్యక్తిని తీసేస్తే.. పార్టీ పోతుందని దుర్భద్దితో వ్యవహరిస్తే ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులు శ్రీదేవమ్మ మన పార్టీ మొట్టమొదటి అభ్యర్థిగా శ్రీ జగన్ తెలిపారు. నారాయణ రెడ్డి అన్నకు ఇవ్వాల్సిన మెజార్టీకి రెండింతలు ఇవ్వండని వైయస్ జగన్ తెలిపారు. ప్రజలు ఎవర్ని అయితే దీవిస్తారో వారు నాయకుడు అవుతారన్నారు. దీవించండి.. ఆశీర్వదించడని పేరుపేరునా శ్రీ జగన్ కోరారు.

Click here for Photogallery

 

Tags :