సలార్2 కంటే ముందే స్పిరిట్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందనున్న స్పిరిట్ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్టవుతుందా అని ఫ్యాన్స్ తో పాటూ సగటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యానిమల్ లో రణ్బీర్ లాంటి సాఫ్ట్ హీరోకే ఆ రేంజ్ మాస్ ఎలివేషన్ ఇచ్చిన సందీప్, ఇక ప్రభాస్ కటౌట్ కు ఎలాంటి ఎలివేషన్ ఇస్తాడో, డార్లింగ్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో అని చూడ్డానికి ఎంతో ఆతృతగా చూస్తున్నారు.
ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. పోలీసులు ఇలా కూడా ఉంటారా అనేలా స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ ను డిజైన్ చేస్తున్నాడట సందీప్. ఇదిలా ఉంటే ప్రభాస్ కు ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా స్పిరిట్ లేటవుతుందనుకున్నారంతా. కానీ ఆ అనుమానాలకు చెక్ పెడుతూ సందీప్ రెడ్డి ఈ అక్టోబర్ నుంచే షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు రీసెంట్ గా ఓ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చాడు.
జూన్ నుంచి ప్రభాస్ ఫ్రీ అయిపోతాడు. వెంటనే రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. సలార్2 కోసం నీల్ కాస్త ఎక్కువ టైమ్ అడగడంతో దాని ప్లేస్ లో స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట ప్రభాస్. అనౌన్స్మెంట్ చేసే ముందే సిట్యుయేషన్స్ ను చూసుకుని ప్రకటించనున్నారట. ఇదే జరిగితే అనుకున్న దానికంటే ముందుగానే అంటే 2025లోనే స్పిరిట్ ను థియేటర్లలో చూడొచ్చు.