ASBL NSL Infratech

హైదరాబాద్‌కు కలిసివచ్చిన రియల్‌ రంగం

హైదరాబాద్‌కు కలిసివచ్చిన రియల్‌ రంగం

గత సంవత్సరం హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌కు బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. నివాస, వాణిజ్య, కార్యాలయ విభాగాలతో పాటు రిటైల్‌ రంగం కూడా మెరుగైన పనితీరునే కనబర్చింది. షాపింగ్‌ మాల్స్‌లో రిటైల్‌ స్పేస్‌ పెరిగింది. గతేడాది నగరంలో 18 లక్షల రిటైల్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక వెల్లడించింది. 2023 ఆగస్టు`డిసెంబర్‌ చివరి త్రైమాసికంలో బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, సికింద్రాబాద్‌, కోకాపేట వంటి సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ (సీబీడీ) ప్రాంతాల్లో లావాదేవీలు ముమ్మరంగా జరిగాయి. గత సంవత్సరం  దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో కొత్తగా 59.48 లక్షల చ.అ. విస్తీర్ణంలో 11 షాపింగ్‌ మాల్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

అదే 2022లో 34.49 లక్షల చ.అ. విస్తీర్ణంలో 8 మాల్స్‌ మార్కెట్‌లోకి వచ్చాయి. ఏడాది కాలంతో పోలిస్తే షాపింగ్‌ మాల్స్‌లో రిటైల్‌ స్పేస్‌ 72 శాతం మేర పెరిగింది. హైదరాబాద్‌లో మూడు మాల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. పుణే, చెన్నైలో రెండేసి, ముంబై, ఢల్లీి, ఎన్‌సీఆర్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఒక్కోటి చొప్పున అందుబాటులోకి వచ్చాయి. కోల్‌కతాలో ఒక్క మాల్‌ కార్యరూపంలోకి రాలేదు. 2023లో 15 లక్షల చ.అ. షాపింగ్‌ మాల్‌ స్పేస్‌ మార్కెట్‌లోకి రాగా.. ఈ ఏడాది నిర్మాణంలో ఉన్న మరో 20 లక్షల చ.అ. స్థలం అందుబాటులోకి రానుంది. నల్లగండ్ల, నానక్‌రాంగూడ, కొంపల్లి వంటి ప్రాంతాలలో కొత్త మాల్స్‌ నిర్మాణంలో ఉన్నాయి. అపర్ణా సంస్థ నల్లగండ్లలో 7 లక్షల చ.అ. విస్తీర్ణంలో మాల్‌ అండ్‌ మల్టీఫ్లెక్స్‌ను నిర్మిస్తుంది. కూకట్‌పల్లిలో 16.60 లక్షల చ.అ. లేక్‌షోర్‌ మాల్స్‌ శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్నాయి.  

మరోవైపు ఆఫీస్‌ స్పేస్‌ (కార్యాలయ స్థలాలు) లీజుకు వచ్చే ఏడాది మంచి డిమాండ్‌ ఉంటుందని జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా వేస్తోంది. దేశవ్యాప్తం గా ఏడు ప్రధాన పట్టణాల్లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత ఏడాది  గతేడాదిలాగానే ఈ ఏడాది కూడా డిమాండ్‌ స్థిరంగా ఉండొచ్చని తెలి పింది. హైదరాబాద్‌, ఢల్లీి ఎన్‌సీఆర్‌, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె పట్టణాలకు సంబంధిం చిన వివరాలతో నివేదిక విడుదల చేసింది.  అంతర్జా తీయంగా మందగమన పరిస్థితులు నెలకొన్న ప్పటికీ, ఈ ఏడాది భారత్‌లో కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ స్థిరంగా ఉందని, వచ్చే ఏడాది తదుపరి దశ వృద్ధిని చూస్తుందని జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది.  

ఈ ఏడాది ఆఫీస్‌ స్పేస్‌ లీజు భారత్‌లో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెరుగుతుందని భావిస్తున్నట్లు  జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. ఏడు పట్టణాల్లో మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ 2023 చివరికి 800 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకుంటుంది. 2023 సెప్టెంబర్‌ చివరికి ఇది 792.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటుందని జేఎల్‌ఎల్‌ ఇండియా ఆఫీస్‌ లీజింగ్‌ అడ్వైజరీ హెడ్‌ రాహుల్‌ అరోరా తెలిపారు. ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ లీజింగ్‌ 2023లో గతేడాది గరిష్ట స్థాయిని అధిగమిస్తుందని, 1,45,000 సీట్లుగా ఉండొచ్చని పేర్కొంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :