ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

'రవికుల రఘురామ' మార్చి 15న అందరూ థియేటర్స్ లో చూద్దాం : విజయ్ సేతుపతి !!!

'రవికుల రఘురామ' మార్చి 15న అందరూ థియేటర్స్ లో చూద్దాం : విజయ్ సేతుపతి !!!

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం 'రవికుల రఘురామ'. సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిక జంటగా నటిస్తున్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథకి ప్రాణం పోస్తున్నారు. అలాగే హీరో హీరోయిన్లు కూడా మంచి పెర్ఫామెన్స్ అందించారు.

వీరందరితో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ పమ్మి అద్భుతమైన పాటలు అందించారు. తన సంగీతాన్ని ఈ చిత్రానికి ఒక సోల్ గా మార్చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన 'చందమామే' అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ అలాగే "ప్రాణాలే" రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు.

విజయ్ సేతుపతి సందర్భంగా చిత్ర యూనిట్ ని అభినందించారు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అలాగే ఈ సినిమాకు వర్క్ చేసిన అందరూ ఆర్టిస్ట్, టెక్నిషియన్స్ మంచి పేరు రావాలని కోరుకుంటున్న అన్నారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :