ASBL NSL Infratech

శంక‌ర్ గ్రీన్ సిగ్న‌ల్ కోసం వారిద్దరూ వెయిటింగ్

శంక‌ర్ గ్రీన్ సిగ్న‌ల్ కోసం వారిద్దరూ వెయిటింగ్

ఒకేసారి ఇండియ‌న్2, గేమ్ ఛేంజ‌ర్ లాంటి రెండు పాన్ ఇండియ‌న్ సినిమాల‌ను షూట్ చేస్తూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాడు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్. ఓ ప‌క్క ఇండియ‌న్2 షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్ష‌న్ వ‌ర్క్స్ పూర్తి చేసుకుంటుంది. దీంతో భార‌తీయుడు సినిమాను రీరిలీజ్ చేయాల‌ని నిర్మాత ఏఎం ర‌త్నం ప్లాన్ చేస్తున్నారు. కానీ శంక‌ర్ నుంచి ఇండియ‌న్2 రిలీజ్ డేట్ ఇప్ప‌టివ‌ర‌కు క‌న్ఫ‌ర్మ్ కాలేదు.

జూన్ రిలీజ్ అన్నారు కానీ ఫ‌లానా తేదీ అనే క్లారిటీ మాత్రం ఇవ్వ‌లేదు. శంక‌ర్ ఇంకా డేట్ క‌న్ఫ‌ర్మ్ చేయక‌పోవ‌డంతో క‌మ‌ల్, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఇద్ద‌రూ కంగారు ప‌డుతున్నారు. ఎందుకంటే ఇండియ‌న్2 రిలీజ్ డేట్ క్లారిటీ వ‌స్తే త‌ప్ప ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌డం కుదర‌దు. శంక‌ర్ రిలీజ్ డేట్ విష‌యంలో క్లారిటీ ఇస్తాడేమో అని చూసీ చూసీ ఎంత‌కీ ఇవ్వ‌క‌పోవ‌డం క‌ల్కి సినిమాను జూన్ 27న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేసేశారు.

క‌ల్కి, ఇండియ‌న్2 రెండు సినిమాల్లో తానునున్నాడు కాబ‌ట్టి క్లాష్ రాకుండా చూసుకోమ‌ని ఇప్ప‌టికే క‌మ‌ల్ చెప్పార‌ట‌. సో ఇప్ప‌టికైనా శంక‌ర్ వీలైనంత త్వ‌ర‌గా రిలీజ్ డేట్ విష‌యంలో ఓ క్లారిటీ ఇవ్వాలి. ఇదిలా ఉంటే గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ ఇంకా జ‌రుగుతూనే ఉంది. స‌మ్మ‌ర్ లో పూర్త‌వుతుందంటున్నారు. షూటింగ్ పూర్త‌య్యాక మ‌రో మూడు నెల‌ల పాటూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ఉంటాయి. గేమ్ ఛేంజ‌ర్ ను అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని నిర్మాత దిల్ రాజు టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ టార్గెట్ ను అందుకోవాలంటే శంక‌ర్, త‌న టీమ్ పరుగులు పెట్టక త‌ప్ప‌దు. ఏదేమైనా శంక‌ర్ రెండు పెద్ద నిర్మాణ సంస్థ‌ల‌ను త‌న గ్రీన్ సిగ్న‌ల్ కోసం వెయిట్ చేయిస్తున్నాడు.  

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :