ASBL NSL Infratech

రిస్క్ చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

రిస్క్ చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ తో ఆడియ‌న్స్ ముందుకొచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ సినిమాతో ఊహించ‌ని షాక్ ను అందుకున్నాడు. ఫ్యామిలీ స్టార్ త‌న కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంద‌నుకుని ఎన్నో ఆశ‌లు పెట్టుకుని ప్ర‌మోష‌న్స్ లో కూడా చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు విజ‌య్. కానీ తీరా చూస్తే అది తీవ్ర నిరాశ ప‌రిచింది. రిలీజైన 21 రోజుల్లోనే ఓటీటీలోకి కూడా వ‌చ్చేసింది.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరితో త‌న త‌ర్వాతి సినిమాను చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా గురించి నెట్టింట ఓ వార్త ప్ర‌చార‌మ‌వుతుంది. ఈ సినిమాలో అస‌లు పాట‌లే ఉండ‌వ‌ని, సీరియ‌స్ జాన‌ర్ లో కేవ‌లం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద నెరేష‌న్ ఉంటుంద‌ని తెలుస్తోంది. అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను పెట్టుకుని సాంగ్స్ లేకుండా ఏంట‌ని విజ‌య్ ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు.

అంతే కాదు, విజ‌య్ సినిమాలో పాట‌లు లేక‌పోవ‌డ‌మంటే ఓ ర‌కంగా అది రిస్కే. అందులో మొద‌టి రిస్క్ మ్యూజిక్ రైట్స్ ప‌రంగా నిర్మాత‌కు డబ్బులు రావు. ఒక‌వేళ సాంగ్స్ ఉంటే వాటిని మంచి రేట్ల‌కు ఆడియో కంపెనీలు పోటీ ప‌డి కొనేవి. కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు. ఇంకో రిస్క్ విజయ్ ఇప్ప‌టివ‌ర‌కు ట్రై చేయ‌ని జాన‌ర్ అది కూడా సాంగ్స్ లేకుండా. మొత్తానికి గౌత‌మ్, విజ‌య్ తో ఏదో పెద్ద‌గానే సెట్ చేస్తున్నాడనేది తెలుస్తోంది. ఇందులో నిజ‌మెంతున్న‌ది ప‌క్క‌న పెడితే ఈ విష‌యంలో ఫ్యాన్స్ మాత్రం బాగా హ‌ర్ట‌వుతున్నారు.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :