ASBL NSL Infratech

తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ ఇది : కేటీఆర్

తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ ఇది : కేటీఆర్

తమ పార్టీ పుట్టుక సంచలనం, దారి పొడవునా రాజీలేని రణం అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ పార్టీ అన్నారు. దీని ప్రస్థానం అనితర సాధ్యమని తెలిపారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ ఇది అన్నారు. ఈ నేల మేలు కోరేది బీఆర్‌ఎస్‌ అని పేర్కొన్నారు. చావు నోట్లో తల పెట్టి రాష్ట్రాన్ని సాధించిన తీరును, లాఠీ దెబ్బలకు భయపడకుండా ముందుకు సాగిన కార్యకర్తల త్యాగనిరతిని కొనియాడారు. అనునిత్యం పార్టీని కంటికి రెప్పలా కాపాడకుంటున్న కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని కేటీఆర్‌ తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :