ASBL Koncept Ambience
facebook whatsapp X

వైరస్ లకు 'కేరళ' రాస్తాగా మారిందా..?

వైరస్ లకు 'కేరళ' రాస్తాగా మారిందా..?

నిఫా.. జికా.. కొవిడ్.. మంకీ పాక్స్.. భారత్ లో ఏ వైరస్ కేసయినా తొలిగా కనిపిస్తోంది కేరళలోనే. దేశంలో రెండు మంకీ పాక్స్ కేసులు రాగా.. రెండూ కేరళవే. వీరిద్దరూ ఇతర దేశాల నుంచి వచ్చిన వారే. ఈ ఏడాది ప్రారంభంలో నిఫా వైరస్ కేరళను వణికించింది. అయితే, వ్యాప్తి అక్కడితోనే ఆగిపోయింది. ఇక జికా వైరస్ గురించి కూడా కేరళలో కలకలం రేపింది. ఏడిస్ ఈజిప్టై దోమ కుట్టడం ద్వారా వ్యాపించే ఈ వ్యాధి బారినపడినవారు పెద్దఎత్తున ఉన్నారు.ఇవే దోమలు చికన్ గన్యా, డెంగీని కూడా వ్యాపింపజేస్తాయి. నిఫా వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపిస్తుంది. వాటి లాలాజలం, మూత్రం, రక్తంలో ఈ వైరస్ ఉంటుంది. పళ్లు, పందులు, ఇతర మార్గాల ద్వారా మనుషులకు అంటుకుంటుంది. మెదడుపై ప్రభావం చూపే ఈ వైరస్ కారణంగా 40 నుంచి 75 శాతం మంది రోగులు చనిపోయే ప్రమాదం ఉంది.

ప్రపంచాన్ని మూడేళ్లుగా వణికిస్తున్న కొవిడ్ కు సంబంధించి భారత్ లో తొలి కేసు కేరళలోనే నమోదైంది. చైనా నుంచి వైద్య విద్యార్థినికి 2020 జనవరి 27న పాజిటివ్ గా తేలింది. రెండో కేసు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదైంది. అయితే, వీరు త్వరగానే కోలుకున్నారు. కొవిడ్ రెండో, మూడో వేవ్ లోనూ కేరళలో కేసులు అత్యధికంగా వచ్చాయి. కోవిడ్ ముగిసిపోయిందనుకుంటున్న ప్రస్తుత తరుణంలోనూ రాష్ట్రంలో నలుగురు చనిపోవడం కలకలం రేపింది.

విదేశీ పర్యటనలతో..

ఇక కేరళలోనే కొత్త వైరస్‌లు వెలుగు చూడడానికి ప్రధాన కారణం ఇక్కడి నుంచి నిత్యం వేలాది మంది విదేశాలకు రాకపోకలు సాగించడమే. అక్షరాస్యత, ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నారు. మరోవైపు కేరళ పర్యాటక రాష్ట్రం కావడంతో విదేశీయులు కూడా ఎక్కువగా కేరళకు వస్తుంటారు. ఇత విదేశాలకు వెళ్లే కేరళ వాసులు, కేరళ నుంచి కేరళకు వస్తున్న విదేశీయులు కొత్త కొత్త వైరస్‌లను మోసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళలోనే కొత్త వైరస్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఇక కేరళలో దట్టమైన అడవులు ఉండడం, గబ్బిలాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. విదేశాల నుంచి కూడా పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. వీటి ద్వారా కూడా కొత్త రకమైన వైరస్‌లు కేరళకు వస్తున్నట్లు తెలుస్తోంది.

టెస్ట్‌ అండ్‌ ట్రేస్‌..

కొత్త వేరియంట్‌ కేసులు కేరళలో పెరుగుతుండడంతో ఆరోగ్య కార్యదర్శి అన్ని రాష్ట్రాలను అలర్ట్‌ చేశారు. కోవిడ్‌ పరిస్థితిపై నిరంతరం జాగరణను కొనసాగించాల్సిన అవసరాన్ని కేరళకు ప్రత్యేకంగా సూచించారు. జిల్లా వారీగా ఇన్‌ఫ్లూంజా లాంటి అనారోగ్యం – తీవ్రమైన అక్యూట్‌ రెస్పిరేటరీ అనారోగ్యం కేసులను అన్ని ఆరోగ్య సదుపాయాలలో రోజూ ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫాం పోర్టల్‌తో సహా, గుర్తించాలని ఆదేశించారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :