దుబాయ్‌లో భారతీయ కాన్సులేట్ ప్రారంభం
భారీ వర్షాలు యూఏఈని అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ వర్షాల కారణంగా ప్రభావితమైన భారతీయు సహాయార్ధం దుబాయ్ లోని భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. G971501205172, G971569950590, G971507347676, G971585754213 నంబర్లను సంప్రదించి భారతీయులు సహాయం కోరవచ్చని తెలిపింది. వర్షాలతో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం యూఏఈ అధికారులు, విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది.
ఎయిర్‌లైన్స్ నుంచి అందే అప్డేట్ను ప్రయాణికులకు తెలియజేస్తున్నామని పేర్కొంది. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా దుబాయ్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నీట మునిగింది. ఫలితంగా కొన్ని విమానాల సర్వీసులు రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది.
Tags :