ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

22 వరకూ హెచ్ 1బీ వీసా దరఖాస్తుకు గడువు

22 వరకూ హెచ్ 1బీ వీసా దరఖాస్తుకు గడువు

విదేశీ వృత్తి నిపుణులు 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌ 1బీ వీసా దరఖాస్తు పెట్టుకోవడానికి ఈ నెల 22తో గడువు ముగుస్తుంది. భారతీయ సాంకేతిక నిపుణుల్లో విపరీతమైన గిరాకీ ఉన్న ఈ వీసా కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 6న మొదలైంది. విదేశీ ఉద్యోగులు అమెరికాలో పని చేయడానికి అనుమతించే హెచ్‌`1బీ వీసా కోసం ఐ-129 ఫారంను,  ప్రీమియం ప్రాసెసింగ్‌కు ఐ`907 ఫారంనూ నింపవలసి ఉంటుంది. ఇవి రెండు మైయు.ఎస్‌.సి.ఐ.ఎస్‌ వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. హెచ్‌`1బీ క్యాప్‌ పిటిషన్లకు ఆన్‌లైన్‌ లో ఫారాల దాఖలు ప్రక్రియ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా 65,000 హెచ్‌1బీ వీసాలను మంజూరు చేస్తారు. దీన్నే హెచ్‌ 1బీ క్యాప్‌ అంటారు. మరో 20,000 వీసాలను అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు. హెచ్‌ 1బీ వీసాలలో అత్యధికం భారతీయ, చైనా  టెక్‌ నిపుణులకు అందుతున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :