KLIA1 and KLIA2 rebranded to KLIA Terminal 1 and KLIA Terminal 2

మలేషియా ప్రభుత్వం KUALA LUMPUR INTERNATIONAL AIRPORT (KLIA) కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం 1 (KLIA 1) మరియు కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం 2 (KLIA2)లను వరుసగా KLIA టెర్మినల్ 1 మరియు KLIA టెర్మినల్ 2 గా రవాణా మంత్రి ఆంథోనీ లోకే రిబ్రాండింగ్ చేశారు.
రవాణా మంత్రి ఆంథోనీ లోకే మాట్లాడుతూ, ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో వచ్చిన ప్రతిపాదన ను, వెంటనే ఆమోదిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇతర ప్రాంతీయ అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోటీని పటిష్టం చేస్తూ వారి మార్కెట్‌బిలిటీ, విలువ మెరుగుపరిచే లక్ష్యంతో ఈ “KLIA మరియు KLIA2 రీబ్రాండ్ ప్రతిపాదన ఆమోదించినట్లు అయన తెలియజేసారు.