ASBL NSL Infratech

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చార్లీ 777 మరియు డ్రామా జూనియర్స్ సీజన్ 6 ప్రారంభం, జూన్ 11న మీ జీ తెలుగులో!

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చార్లీ 777 మరియు డ్రామా జూనియర్స్ సీజన్ 6 ప్రారంభం, జూన్ 11న మీ జీ తెలుగులో!

తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఫన్​ అండ్​ ఎమోషనల్​ డ్రామా చార్లీ 777ని వరల్డ్​ ప్రీమియర్​ గా ఈ ఆదివారం అందిస్తోంది. అలాగే చిన్న పిల్లల్లోని టాలెంట్​ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్​ఫుల్​ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ తదుపరి సీజన్​తో మీ ముందుకు రానుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ నటీనటులు జయప్రద, బాబు మోహన్ మరియు శ్రీదేవి విజయ్‌కుమార్ ఈ షోకు జడ్జిలుగా వ్యహరించనున్నారు. తెలుగు టెలివిజన్​ చరిత్రలో సీనియర్​ హీరోయిన్​ జయప్రద మొదటిసారి డ్రామా జూనియర్స్ సీజన్ 6తో బుల్లితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు. చార్లీ 777 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మరియు  డ్రామా జూనియర్స్​ సీజన్​ 6, జూన్​ 11న ప్రారంభం, ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు, జీ తెలుగులో మాత్రమే.

ప్రేక్షకుల హృదయాన్ని తాకిన చార్లీ 777 సినిమా మీ సాయంత్రాన్ని మరింత వినోదంగా మారుస్తుంది. ఓ రోడ్డు ప్రమాదంలో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన ధర్మ జీవితం నిరాశ, నిస్పృహలతో సాగుతూ ఉంటుంది. తన గురించి పట్టించుకునే వాళ్లుగానీ, పలకరించే వాళ్లుగానీ ఎవరూ ఉండరు. అలాంటి ధర్మ జీవితంలోకి అనుకోకుండా వచ్చి చేరుతుంది చార్లీ(లాబ్రడార్​ బ్రీడ్​ కుక్క). అప్పటివరకు ఎలాంటి ఫీలింగ్స్​ లేకుండా బతికిన ధర్మకు జీవితంపై ఆశ, సంతోషం కలుగుతుంది. సరదాగా సాగుతున్న వారి జీవితంలో అనుకోని ఘటన. ఆ తర్వాత ఏం జరిగింది?, చార్లీ కోసం ధర్మ ఏం చేశాడు?.. అనేది తెలుసుకోవాలంటే జూన్​ 11న జీ తెలుగులో సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే చార్లీ 777 తప్పక చూడండి. ఈ సినిమాలో ధర్మగా రక్షిత్ శెట్టి నటించగా, సంగీత శృంగేరి, రాజ్ బి. శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా మరియు అనిరుధ్​రాయ్ సహాయక పాత్రల్లో నటించారు.

 ఇక, సంవత్సరాల నుంచి అందరి హృదయాలను గెలుచుకున్న డ్రామా జూనియర్స్ విజయవంతంగా 5 సీజన్‌లను పూర్తి చేసుకుని​ 6వ సీజన్‌తో మరోసారి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమైంది. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లోని పిల్లల్లో దాగున్న నటనా ప్రతిభను వెలికి తీసే ఉద్దేశ్యంతో కొత్త సీజన్​ని ప్రారంభిస్తోంది. ఈ షో ను ఎవర్​గ్రీన్​ ఎనర్జిటిక్​ యాంకర్​ ప్రదీప్​ మాచిరాజు హోస్ట్​ చేయనున్నారు. పిల్లల స్కిట్​లకీ, ప్రదీప్​ కామెడీ పంచులు, టైమింగ్​ తోడైతే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం.

 ప్రతిభ గల చిన్నారులను మరింత ప్రోత్సహించి వారిని ఆశీర్వదించేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులు జయప్రద, బాబు మోహన్ మరియు శ్రీదేవి విజయ్‌కుమార్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన సీనియర్​ హీరోయిన్​ జయప్రద జీ తెలుగు డ్రామా జూనియర్స్​తో మొదటిసారి బుల్లితెర ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రముఖ హాస్యనటుడు బాబు మోహన్ ఆశీస్సులు, అందాల నటి శ్రీదేవి సలహాలు పిల్లలకు మరింత ఉత్సాహాన్ని అందించనున్నాయి. మరి జీ తెలుగు అందిస్తున్న ఈ వినోదాన్ని మీరూ తప్పక ఆస్వాదించండి.

ఈ ఆదివారం ఆహ్లాదం పంచే కార్యక్రమాలతో మిమ్మల్ని అలరించేందుకు జీ తెలుగు సిద్దమైంది. వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​ చార్లీ 777 మరియు డ్రామా జూనియర్స్​ సీజన్​ 6 ప్రారంభం, తప్పక చూడండి!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :