విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం.. రాజ్యసభ ప్యానెల్‌కు ఎంపిక

విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం.. రాజ్యసభ ప్యానెల్‌కు ఎంపిక

రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపికయ్యారు. విజయసాయిరెడ్డితోపాటు మరో ఏడుగురు సభ్యులతో కూడిన ప్యానెల్‌కు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వల్ల రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేకపోతే.. విజయసాయి ప్యానెల్ వైస్ చైర్మన్ హోదాలో సభా సమావేశాలను నడిపిస్తారు. తనకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై  విజయసాయిరెడ్డి స్పందించారు. తనకు ఇలా రాజ్యసభ వైస్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చిన రాజ్యసభ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విజయసాయిరెడ్డితోపాటు ఎంపికైన  రాజ్యసభ నిర్వహణాధికారుల పేర్లను రాజ్యసభ అడ్మినిస్ట్రేషన్ తమ వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఈ జాబితాలోని వివరాలు..

రాజ్యసభ చైర్మన్- జగదీప్ ధన్ కడ్
డిప్యూటీ చైర్మన్- హరివంశ్

వైస్ చైర్మన్ ప్యానెల్ సభ్యులు..

విజయసాయిరెడ్డి
భుబనేశ్వర్ కలితా
వందనా చవాన్
సుఖేందు శేఖర్ రే
డాక్టర్ ఎల్. హనుమంతయ్య
ఇందు బాలా గోస్వామి
డాక్టర్ సస్మిత్ పట్రా
తిరుచ్చి శివ

 

Tags :